ETV Bharat / state

KODANDARAM: 'ఆ ప్రచారాన్ని నమ్మకండి: కోదండరాం'

తెజస కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని తప్పుడు ప్రచారం జరుగుతోందని తెజస అధినేత కోదండరాం తెలిపారు. విలీనానికి సంబంధించి రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. సమస్యల ప్రాతిపదికన ఏ పార్టీతోనైనా కలిసి పోరాట చేస్తామన్నారు.

KODANDARAM:  'తెజస కాంగ్రెస్​లో విలీనమవుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు'

author img

By

Published : Jul 9, 2021, 3:39 PM IST

తెలంగాణ జనసమితి(తెజస) కాంగ్రెస్‌ పార్టీలో విలీనం అవుతుందని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. విలీనానికి సంబంధించి రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. పోడు భూములు, కృష్ణా నదీ జలాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పోరాటం కొనసాగిస్తామని.. పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ఏ పార్టీతోనైనా కలిసి పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో ఏడాది పాటు పనులు చేయించుకొన్న నర్సులను ఇప్పటికిప్పుడు తొలగించడం దారణమన్నారు. సమస్యలను చెప్పుకునేందుకు ప్రగతి భవన్‌కు వెళ్తే అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని కోదండరాం స్పష్టం చేశారు.

తప్పుడు ప్రచారమే..

తెజస కాంగ్రెస్‌లో విలీనం అవుతోందని తప్పుడు ప్రచారం జరుగుతోంది. ప్రజలు తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. కాంగ్రెస్, తెజస పార్టీల మధ్య అలాంటి చర్చలు జరగలేదు. పోడు భూములు, కృష్ణా నదీ జలాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పోరాటం చేస్తాం. సమస్యల ప్రాతిపదికన ఏ పార్టీతోనైనా కలిసి పోరాటం చేస్తాం. -కోదండరాం, తెలంగాణ జనసమితి అధినేత

ఇదీ చదవండి: L. Ramana: రాష్ట్ర తెదేపా అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.