ETV Bharat / state

కెన్యా మాజీ ప్రధాని సోదరుడికి హైదరాబాద్​ యశోద ఆసుపత్రిలో మోకీలు మార్పిడి

author img

By

Published : Nov 27, 2022, 8:40 AM IST

హైదరాబాద్​ యశోద ఆసుపత్రిలో కెన్యా మాజీ ప్రధాని సోదరుడు ఒబురు ఓడింగాకు మోకీలు మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. కెన్యా కంటే ఇక్కడ తక్కువ ఖర్చులోనే వైద్య సేవలు అందుతున్నట్లు చెప్పారు.

Yashoda Hospital
Yashoda Hospital

హైదరాబాద్​లో కెన్యా మాజీ ప్రధాని రైలా ఓడింగా సోదరుడు.. సియాయా కౌంటీకి చెందిన సెనేటర్‌ ఒబురు ఓడింగాకు యశోద ఆసుపత్రిలో మోకీళ్ల మార్పిడి చికిత్స విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌, మోకీళ్ల మార్పిడి నిపుణులు డాక్టర్‌ దశరథ్‌ రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చికిత్స విజయవంతమైంది. ఓడింగా గత కొన్నేళ్లుగా మోకీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అందులోనూ ఎడమ మోకీలు పూర్తిగా అరిగిపోయి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.

తొలుత యూరప్ దేశాల్లో చికిత్స కోసం సంప్రదించగా.. అక్కడ పరీక్షలు చేసి వైద్యం అందించారు. ఆ తరువాత కొన్ని రోజులకు సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో ఓబురు స్నేహితుల సలహాతో హైదరాబాద్‌ యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ దశరథరామిరెడ్డిని సంప్రదించారు. ఓబురు ఈ నెల 7న ఆసుపత్రిలో చేరగా.. మరుసటి రోజున సర్జరీ చేసినట్లు డాక్టర్‌ దశరథ రామిరెడ్డి తెలిపారు. శస్త్ర చికిత్స జరిగిన రెండో రోజునే వాకర్‌ సహాయంతో నడిపించినట్లు వివరించారు. కెన్యా కంటే ఇక్కడ తక్కువ ఖర్చులోనే వైద్య సేవలు అందుతున్నాయని ఓబురు హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: తెలంగాణ అంకురం మొదటి సంస్థగా చరిత్ర లిఖించింది: కేసీఆర్‌

ప్రైడ్​ మెట్రో స్టేషన్​కు టీమ్​ లీడర్​గా హిజ్రా.. అది వారికే అంకితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.