కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ మొదటి విడత ప్రవేశ పరీక్ష మార్చి 8 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఎల్ఎస్ఎస్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్రాల్లో ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రవేశ పరీక్ష గోడపత్రికలను ఇవాళ ఆవిష్కరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఫీజులో రాయితీలతో పాటు ఉపకార వేతనాలు, నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
కొవిడ్ సంక్షోభంలోనూ విద్యార్థులకు సమయం వృథా కాకుండా విద్యా సంవత్సరం పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. గత పదిహేనేళ్లుగా తమ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులందరికీ ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు లభించాయని వీసీ వివరించారు. దరఖాస్తులు కేఎల్ యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలని అడ్మిషన్స్ డైరెక్టర్ జె.శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చదవండి: ఆధార్ వ్యథలు... చలిలోనే రేషన్దారుల అవస్థలు