Kishan Reddy Hunger Strike Ended : హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిరాహార దీక్ష విరమించారు. ఆయనకు నిమ్మరసం ఇచ్చి.. ప్రకాశ్ జావడేకర్ దీక్ష విరమింపజేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ 24 గంటల పాటు కిషన్‌రెడ్డి (KishanReddy ) నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 11 గంటలకు ఇందిరా పార్కు వద్ద దీక్ష మొదలు పెట్టిన కిషన్ రెడ్డి ఇవాళ ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విరమించారు.
Kishan Reddy On Unemployment in Telangana : అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్‌పై మేధావులు ఒక్కసారి ఆలోచించాలని కిషన్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పడు చేసిన దుర్మార్గాలను మరిచిపోవద్దని గుర్తు చేశారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే నిజాం పాలన వస్తుందని అన్నారు. హస్తం పార్టీకి ఓటు వేస్తే భారత్ రాష్ట్ర సమితిని సమర్థించినట్లే అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌తో వెళ్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పారని కిషన్‌రెడ్డి తెలిపారు.
BJP On Unemployment in Telangana : 'కేసీఆర్ సర్కార్ విఫలమైంది.. తెలంగాణలో విప్లవం మొదలైంది'
BJP Leaders Hunger Strike Ended in Hyderabad : కేసీఆర్ గురువు అసదుద్దీన్ ఒవైసీ అని ... కేసీఆర్‌కు ఓటేస్తే ఆయన ఎంఐఎం కోసం పని చేస్తారని.. నిజాం పాలనను తెస్తారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం మేలుకోవాలని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం కోసం పోరాడిన సంఘాలన్నింటిని ముఖ్యమంత్రి నిర్వీర్యం చేశారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
ఉద్యోగాలను భర్తీ చేసే టీఎస్‌పీఎస్సీలోనే ఖాళీలు ఉన్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. ఉద్యమ సమయంలో పోలీసులు ఇదే తీరుగా వ్యవహరించి ఉంటే కేసీఆర్ కుటుంబసభ్యులు పారిపోయేవారని విమర్శించారు. ఉద్యమ సమయంలో తాను రాజీనామా చేయలేదంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. అప్పుడు కేసీఆర్ ఏనాడైనా రోడ్డెక్కారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే గూటి పక్షులని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
"తెలంగాణ సమాజమా మేలుకో. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్‌ను సమర్థించినట్లే. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌తో వెళ్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. కేసీఆర్ గురువు అసదుద్దీన్ ఒవైసీ. కేసీఆర్‌కు ఓటేస్తే ఎంఐఎం కోసం పనిచేస్తారు. అధికారంలోకి వస్తే కచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Prakash Javadekar Fires on KCR : నిరుద్యోగుల తరఫున పోరాటం చేసేందుక కిషన్‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని.. ప్రకాశ్ జావడేకర్ పేర్కొన్నారు. దీక్ష నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు చూపిన తెగువను అభినందించారు. ఇప్పటికే వివిధ సందర్భాల్లో కమలం పార్టీ సత్తా ఏంటో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చూపించామని అన్నారు. కిషన్‌రెడ్డి శాంతియుతంగా ధర్నా చేసినా అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు. తెలంగాణ యువతను మోసం చేశాననే విషయం కేసీఆర్‌కు తెలుసు కాబట్టే.. భయంతో పోలీసులను పంపించారని మండిపడ్డారు. రాబోయే వంద రోజుల్లో సీఎం అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలను కొనసాగిస్తామని ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు.
Kishan Reddy on Telangana Elections Schedule : తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: కిషన్‌రెడ్డి
BJP Leaders Nirasana Deeksha in Hyderabad : 'కేసీఆర్‌కు జమిలి ఎన్నికలు అంటే భయం పట్టుకుంది'