సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎవరైనా కొవిడ్-19 బారినపడితే.. వారికి లాలాగూడ ఆసుపత్రిలో చికిత్సను అందించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో రైల్వే ఉద్యోగులు బాధ్యతలు నిర్వహించడం, నిరంతరం సరుకుల రవాణా రైళ్లను, ప్యాసింజర్లను నడపటంలో చురుగ్గా ఉంటున్నారన్నారు.

ఇందువల్ల వారు కరోనా బారినపడే అవకాశాలున్నాయని కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని లాలాపేట కేంద్ర ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు వైద్యం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని లేఖలో కోరారు. దీనివల్ల గాంధీ ఆసుపత్రులపైన పనిభారం కొంతమేర తగ్గడంతో పాటు బాధితులకు మెరుగైన చికిత్స పొందే అవకాశం ఉంటుందని కిషన్రెడ్డి అన్నారు.
ఇదీచూడండి: సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ విఠల్ కన్నుమూత