దిల్లీ నుంచి జూమ్ వీడియో ద్వారా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు. ఒకటి నుంచి పన్నెండో తరగతి విద్యార్థుల కోసం వన్ క్లాస్ వన్ టీవీ పేరుతో కేంద్ర ప్రభుత్వం 12 టీవీ ఛానల్స్‌ను తీసుకు వస్తోందన్నారు. హైదరాబాద్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోందని... అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వలస కార్మికులు ఉండే ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయడం, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తామని ప్రకటించారు.
ఇతర రాష్ట్రాలకు బతుకుదెరువు కోసం పోయి వచ్చిన వలస కార్మికులను గ్రామస్థులు అక్కున చేర్చుకోవాలన్నారు. అధికారులు వాళ్లకు వైద్య పరీక్షలు చేయడం వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు. లాక్‌డౌన్ స్ఫూర్తిని ప్రజలందరూ కొనసాగించాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : 'బైంసా బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తా'