3 రోజుల క్రితం రాంగోపాల్‌పేట్ పీఎస్ పరిధిలో కిడ్నాపైన ఫాతిమా కథ సుఖాంతమైంది. పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీసీ దృశ్యాల ఆధారంగా నిందితుని ఆచూకీ తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తనకు అమ్మాయిలు లేని కారణంగానే ఫాతిమాను కిడ్నాప్ చేసినట్లు నిందితుడు వెల్లడించినట్లు చెప్పారు.
ఫాతిమా తండ్రి రాజు... నిందితుడు సలీం గతంలోనే స్నేహితులని, చెత్త కాగితాలు ఏరుకుని జీవనం సాగించే వారని దర్యాప్తులో తేలిందన్నారు. ఈనెల 11న రాత్రి సమయంలో రాజుకు సలీం కుటుంబంతో సహా కనిపించాడు. ఆ రోజు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోనే అందరూ కలిసి పడుకున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా అడుక్కునేందుకు వచ్చినట్లు సలీంకు చెప్పాడు. ఫాతిమా ఆరోగ్యం సరిగా లేనందున సలీంను చూసుకోమని చెప్పి... నల్లగుట్టకు వెళ్లారు. మళ్లీ తిరిగివచ్చే సమయానికి తమ కూతురు, సలీం ఇద్దరూ కన్పించకపోయేసరికి ఆందోళనతో... అంతా వెతికారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ ఉదయం కిషన్‌బాగ్‌లో పాపను కనుగొన్నారు. కేసును మరిన్ని కోణాల్లో విచారణ చేయాల్సి ఉందని...పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: సికింద్రాబాద్ నల్లగుట్టలో కిడ్నాప్ కలకలం