కరోనా నివారణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేయడం తగదన్నారు. ఖైరతాబాద్‌లోని బడా గణేశ్ దేవాలయం వద్ద 500 మంది పేదలు, వలస కూలీలకు ఆయన నిత్యావసరాలను పంపిణీ చేశారు.
తన తల్లిదండ్రులు దానం లింగమూర్తి, లక్ష్మీబాయిల పేరిట ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తన నియోజకవర్గంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్ ముగిసే వరకు నిత్యావసరాలు పంపిణీ చేస్తామని దానం స్పష్టం చేశారు. వైద్య, పోలీస్, పారిశుద్ధ్య, రెవెన్యూ సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు.
ఇవీచూడండి: పెళ్లి కోసం 850కి.మీ సైక్లింగ్- ముహూర్తం టైమ్‌కు క్వారంటైన్