ఖైరతాబాద్ ధన్వంతరి నారాయణ మహాగణపతి నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. సెప్టెంబరు 1న మధ్యాహ్నం 12 గంటలకు విగ్రహాన్ని తరలించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తోంది. సోమవారమే కలశాన్ని కదిలించినట్లు కమిటీ సభ్యులు ప్రకటించారు. కరోనా దృష్ట్యా ఈ ఏడాది మహాగణపతిని సుమారు 4 లక్షల మంది స్వయంగా.. మరో 4 లక్షల మంది ఆన్లైన్లో దర్శించుకున్నారని కమిటీ వివరించింది.
ధన్వంతరి నారాయణ గణపయ్యకు మంగళవారం మధ్యాహ్నం ఊరేగింపు ప్రారంభించనున్నారు. రాజ్‌దూత్ హోటల్, టెలిఫోన్ భవన్ మీదుగా ఎన్టీఆర్ పార్కు ముందు ఉన్న క్రేన్ నెంబర్ 4 వద్ద నుంచి నిమజ్జనం చేయనున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు.