Khadi started Center for Rural Industries in Hyderabad: 74వగణతంత్ర దినోత్సవంలో భాగంగా జాతీయ సూక్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలో భాగమైన ఖాదీ.. హైదరాబాద్ యూసఫ్‌గూడలో గ్రామీణ పరిశ్రమల కొత్త అనుభవ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించింది. ప్రజలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటైన కేవీఐసీలో జరిగే కార్యకలాపాలపై అవగాహాన కల్పించడానికే కేంద్రాన్నిప్రారంభించినట్లు నిర్వాహాకులు తెలిపారు. ఈ సందర్భంగా ఈ అనుభవ కేంద్రాన్ని ఎవరైనా సందర్శించవచ్చని డైరెక్టర్ శశి రంజన్ వర్మ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేవీఐసీలో ఇది వరకే శిక్షణ పొంది వ్యాపారాలు ప్రారంభించిన వారు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఉప్పు, పంచదార వంటి వాటిని పక్కన పెడుతూ మిలెట్లతో చేసిన పదార్థాలతో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏన్షియంట్ ఫూడ్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. పాటరీపై ఆసక్తి ఉన్న వారికోసం ప్రత్యేకమైన స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన కేవీఐసీ కేంద్రం సభ్యులు, సందర్శకులు ఉత్సాహాంగా గడిపారు. చేనేత తయారీ విధానాన్ని దగ్గరుండి గమనించారు. త్వరలో ఈ కేంద్రంలో మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ డైరెక్టర్ శశి రంజన్ వర్మ తెలిపారు.
ఇవీ చదవండి: