ETV Bharat / state

పన్నుల ఖర్చుపై ప్రజలకు లెక్క.. 15వ ఆర్థిక సంఘం కీలక సిఫార్సులు - తెలంగాణ వార్తలు

నిధుల కేటాయింపుపై 15వ ఆర్థిక సంఘం కీలక సిఫార్సులు చేసింది. ఆడిట్ నివేదికలు ఆన్‌లైన్‌లో పెడితేనే నిధులు మంజూరు చేయాలని సూచించింది. ఆర్థిక సంఘం గ్రాంట్లలో పంచాయతీలకు 70 శాతం తగ్గకుండా, మిగిలిన రెండు వ్యవస్థల్లో 25 శాతం మించకుండా ఇవ్వాలని తెలిపింది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు గ్రాంట్లను పొందాలంటే విధిగా సంస్థల ప్రాథమిక లెక్కలు, ఆడిట్‌ చేసిన లెక్కలను ఆన్‌లైన్‌ అందరికీ అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది.

key-recommendations-of-the-15th-financial-commission-about-accounting-to-the-public-on-the-cost-of-taxes
పన్నుల ఖర్చుపై ప్రజలకు లెక్క.. 15వ ఆర్థిక సంఘం కీలక సిఫార్సులు
author img

By

Published : Feb 6, 2021, 7:13 AM IST

పంచాయతీరాజ్‌ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు ఆడిట్‌ నివేదికలను ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో పెట్టకుంటే కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లను విడుదల చేయకూడదని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు నిధులను పొందడమే కాకుండా ఖర్చు వివరాలను ప్రజలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ప్రజలు చెల్లించే పన్నులపై వారికి లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉందని ఆర్థికసంఘం అభిప్రాయపడింది. రాష్ట్ర ఆర్థిక సంఘాలను (ఎస్‌ఎఫ్‌సి) ఏర్పాటు చేసి వాటి నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుని ఆ చర్యల నివేదికలను శాసనసభల్లో ప్రవేశపెట్టకుంటే 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు రాష్ట్రాల స్థానిక సంస్థలకు నిధులను విడుదల చేయకూడదని పేర్కొంది. మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థలోని అన్ని వ్యవస్థలు కీలకమే అని పేర్కొంటూ గ్రామ పంచాయతీలతో పాటు మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఇచ్చేలా సిఫారసు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లపాటు ఇచ్చే నిధులను సిఫారసు చేయడంతో పాటు నిధులు ఇచ్చే విధానంలో కీలక మార్పులకు నాంది పలికింది. కేంద్ర పన్నుల రాబడి ప్రాతిపదికగా కాకుండా కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు అందే నిధులు నికరంగా ఉండేలా కేటాయింపులు చేసింది.

key-recommendations-of-the-15th-financial-commission-about-accounting-to-the-public-on-the-cost-of-taxes
స్థానిక సంస్థలకు నిధులు ఇలా...

మండల పరిషత్‌లు, జడ్పీలకు గ్రాంట్లు

14వ ఆర్థిక సంఘం కేంద్ర గ్రాంట్లను పూర్తిగా పంచాయతీలకే ఇచ్చేలా సిఫారసు చేయడంతో ఐదేళ్లపాటు రెండు రాష్ట్రాల్లోని మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు నిధులు అందలేదు. తాజాగా 15వ ఆర్థికసంఘం సిఫార్సుల కారణంగా వాటికి మళ్లీ నిధులు అందనున్నాయి. ఆర్థిక సంఘం గ్రాంట్లలో పంచాయతీలకు 70 శాతం తగ్గకుండా, మిగిలిన రెండు వ్యవస్థల్లో 25 శాతం మించకుండా నిధులను ఇవ్వాలని సిఫారసు చేసింది.

లెక్కలు లేకుంటే గ్రాంట్లులేవు

గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు గ్రాంట్లను పొందాలంటే విధిగా సంస్థల ప్రాథమిక లెక్కలు, ఆడిట్‌ చేసిన లెక్కలను ఆన్‌లైన్‌ అందరికీ అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆస్తిపన్ను రేట్లను నిర్ధారించాలి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిరేటుకు అనుగుణంగా ఆస్తిపన్ను వసూళ్లు పెరగాలి.

ఏటీఆర్‌లు అసెంబ్లీలో పెట్టాలి

రాష్ట్ర ఆర్థిక సంఘాల విధానం నామమాత్రంగా మారిన నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం వాటికి ప్రత్యేక మార్గదర్శకాలను సూచించింది. ఆర్థిక సంఘాలను విధిగా ఏర్పాటు చేయాలని, ఆర్థిక సంఘం సిఫారసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నివేదిక (ఏటీఆర్‌)ను 2024 సంవత్సరం మార్చి లోపు రాష్ట్ర శాసనసభల్లో ప్రవేశపెట్టాలని సూచించింది. లేకుంటే స్థానిక సంస్థలకు 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు నిధులు విడుదల చేయకూడదని స్పష్టం చేసింది.

నిధులు ఆలస్యం చేస్తే వడ్డీ

కేంద్రం రాష్ట్రాలకు నిధులు ఇచ్చాక వాటిని పది పనిదినాల్లో స్థానిక సంస్థలకు నిధులను బదిలీ చేయాలి. పది పనిదినాల తర్వాత జమచేస్తే మార్కెట్‌ రుణాలకు చెల్లించే వడ్డీతో కలిపి స్థానిక సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఏటా కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లను ఏటా రెండువిడతలుగా విడుదల చేయాలి. రెండు సమాన వాయిదాల్లో జూన్‌, అక్టోబర్‌లో విడుదల చేయాల్సి ఉంటుంది. 60 శాతం నిధులను ఆర్థిక సంఘం నిర్దేశించిన అంశాలకు 40 శాతం గ్రాంట్లను వేతనాలు, నిర్వహణ వ్యయానికి కాకుండా ఇతర వాటికి వ్యయం చేయాలి.

నిధులను ఇలా వ్యయం చేయాలి

గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం నిధులు కనీస వసతుల కల్పనకు కేటాయించాలి. పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మల విసర్జనలేని ప్రాంతాల నిర్వహణ, తాగునీరు, వాననీటి సంరక్షణ, మురుగు జలాలశుద్ధి, పునర్‌వినియోగం వంటివాటికి ఖర్చుచేయాలి. మిలియన్‌ జనాభాకంటే తక్కువ ఉన్న పురపాలక సంఘాలకు బేసిక్‌ గ్రాంట్లలో 60 శాతం నిధులను నిర్దేశించిన వాటికే వ్యయం చేయాలి. పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, కేంద్ర పురపాలకశాఖ నిర్దేశించిన స్టార్‌ రేటింగ్‌లు, తాగునీరు, వాననీటి సంరక్షణ, వాటర్‌ రీసైక్లింగ్‌ చేయాల్సి ఉంటుంది. 40 శాతం నిధులను వేతనాలు, కార్యాలయ నిర్వహణకు కాకుండా ఇతర పట్టణాల అవసరాలకు వ్యయం చేసే స్వేచ్ఛ పురపాలక సంఘాలకు ఉంటుంది. మిలియన్‌ జనాభాకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాన్ని ఒక యూనిట్‌గానే పరిగణనలోకి తీసుకోవాలి. నగరంలో నిర్దేశించిన గాలి నాణ్యతను ప్రాతిపదికగా తీసుకోవాలి. తాగునీరు, వాననీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణలను ప్రాతిపదికగా ఉండాలి. ఈ ప్రాతిపదికలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయిస్తుంది.

ఇదీ చదవండి: ఎన్నికల వేళ తమిళనాడు సర్కార్​ వరాల జల్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.