ఏటా ఆషాడ మాసంలో జరిగే బోనాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కొవిడ్-19 మహమ్మారి విజృంభన సందర్భంగా ఈసారి బోనాలు నిర్వహించాలా లేదా అనే అంశంపై కీలక సమీక్ష నిర్వహించనున్నారు.
రాజధానిలో తీవ్రత ఎక్కువ..
హైదరాబాద్ నగరంలో కరోనా సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బోనాలు నిర్వహణ అంత సులభమైమీ కాదు. జిల్లాల్లోనూ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో భారీ జనసందోహాల మధ్య సాగే బోనాలపై విస్త్రృత చర్చ జరుగనుంది. సోమవారం నుంచి దేవాలయాలు , ప్రార్థనా మందిరాలను ప్రభుత్వం అనుమతించింది.
నిబంధనల అమలు సాధ్యం అయ్యేనా ?
భౌతిక దూరం నిబంధనలను అమలు చేస్తోంది. బోనాల్లో భౌతిక దూరం నిబంధనలు సాధ్యం కాదని ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మాస్కులు ధరించి కొద్దిమందితోనే జరిగేలా అనుమతులు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది.
కేంద్రం నిషేధం..
మరోవైపు మతసంబంధిత విషయాల్లో కేంద్ర ప్రభుత్వం నిషేధం అమల్లో ఉంది. ఈ సందర్భంగా బోనాలు నిర్వహించే సాధ్యసాధ్యాలపై బుధవారం ఉదయం పది గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, సబితారెడ్డి , మల్లారెడ్డి తదితరులు పాల్గొని చర్చించనున్నారు.
ఇవీ చూడండి : 'అంతర్రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం.. సిటీ బస్సులకు నో'