KCR Comments on Population Calculations: "1871నుంచి ఇప్పటి వరకు 140 ఏళ్లలో జనాభా గణన ఏ ఒక్కసారి కూడా ఆగలేదు. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోనూ జనాభా గణన ఆగలేదు. మరి ఇప్పుడు మోదీ ప్రభుత్వం జనాభా గణన ఎందుకు చేపట్టడం లేద"ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించిన ఆయన.. జనాభా లెక్కలు జరిగితే బీజేపీ బండారం బయటపడుతుందని భయపడుతోందని ఆరోపించారు. జనాభా గణన చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీలు అడుగుతున్నారని తెలిపారు.
కాళేశ్వరం, పాలమూరుపై ఎన్ని కుట్రలు చేశారో ఈటల రాజేందర్‌కు తెలియదా అని పేర్కొన్న కేసీఆర్.. కుట్రలన్నీ ఛేదించి అనేక ప్రాజెక్టులు సాధించుకున్నామని తెలిపారు. ఇప్పుడు సాగులో పంజాబ్‌ను తలదన్నే పరిస్థితికి ఎదిగామని తెలిపారు. నీళ్ల లెక్కలు తేల్చేందుకు కాంగ్రెస్ వల్ల కాదు.. బీజేపీ వల్ల కాదు.. అందుకే బీఆర్‌ఎస్‌ను తీసుకొచ్చామని ప్రకటించారు.
KCR speech in Assembly: తెలంగాణ సహా దేశంలోని ప్రతి ఎకరానికి నీళ్లు రావాలని కోరుకునేవాడినని పేర్కొన్న కేసీఆర్.. కేంద్రంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని.. కొత్త జల విధానం తీసుకొస్తామని ప్రకటించారు. ఐదారేళ్లలో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ తరహాలో తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
"మన పిల్లలు పిజ్జాలు, బర్గర్లు తినాల్సిన అగత్యం ఏంటి? దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఎంతో అవకాశం ఉంది. అదానీ, అంబానీలకు కాదు. రైతుల పిల్లలకు అప్పులిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. తెలంగాణ గడ్డ మీద పుట్టినా.. నేను భారతీయుడిని. తెలంగాణ సహా దేశంలోని ప్రతి ఎకరానికి నీళ్లు రావాలని కోరుకునేవాడిని. వాక్ శుద్ధి, చిత్త శుద్ధి, సంకల్ప శుద్ధి ఉంటే.. తలచుకుంటే ఏదైనా సాధ్యమే? ఉమ్మడి ఏపీ నుంచి దిల్లీ వెళ్లా.. తెలంగాణ సాధించే మళ్లీ వచ్చా.. కేంద్రంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుంది.. కొత్త జల విధానం తీసుకొస్తాం. మోదీ ప్రభుత్వం జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదు? 1871నుంచి 140 ఏళ్లలో జనాభా గణన ఏ ఒక్కసారి కూడా ఆగలేదు. జనాభా గణన చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీలు అడుగుతున్నారు. జనాభా లెక్కలు లేకుండా ఏ దేశంలోనూ పరిపాలన సాగదు."- కె. చంద్రశేఖర్ రావు, తెలంగాణ సీఎం
ఇవీ చదవండి:
హిండెన్‌బర్గ్ నివేదికపై మోదీ వివరణ ఇవ్వాల్సిందే: సీఎం కేసీఆర్
ఈ లెక్కలు అవాస్తవమైతే రాజీనామా చేస్తా: సీఎం కేసీఆర్
'మన్మోహన్ పాలనతో పోలిస్తే.. మోదీ హయాంలో దేశం ఘోరంగా దెబ్బతిన్నది'
ఆ 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కనివ్వం: రేవంత్‌రెడ్డి