ETV Bharat / state

KCR on INDIA Alliance : NDA, INDIA కూటమికి BRS​ దూరం.. దేశంలో మార్పు జరగాల్సిందేనన్న కేసీఆర్ - BRS

KCR on INDIA Alliance and NDA : ఇండియా, ఎన్డీఏ కూటముల్లో ఉండాల్సిన అవసరం లేదని, తాము ఒంటరిగా ఏమీ లేమని, తమతో కలిసి నడిచే మిత్రులున్నారని బీఆర్​ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టంచేశారు. దేశంలో 50 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నది ఆ కూటముల వారేనని, అయినా మార్పు రాలేదని గుర్తుచేశారు. దేశంలో నూతన మార్పు జరగాల్సిందేనని మహారాష్ట్ర పర్యటనలో కేసీఆర్​ పునరుద్ఘాటించారు.

KCR
KCR
author img

By

Published : Aug 2, 2023, 9:03 AM IST

ఆ కూటములకు బీఆర్​ఎస్​ దూరం.. దేశంలో మార్పు జరగాల్సిందే

KCR Speech in Maharastra tour about NDA, INDIA Alliance : ఒకరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర వాటేగామ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో ఎన్నికల సమర శంఖం పూరించామని, అన్ని గ్రామాల్లోనూ తొమ్మిది కమిటీలను నియమిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 50శాతం గ్రామాల్లో వీటి ఏర్పాటు పూర్తయిందని, మరో 15 నుంచి 20 రోజుల్లో మిగిలినవి పూర్తి చేస్తామన్నారు.

క్రమేణా రాష్ట్రస్థాయి వరకు కమిటీలను వేసుకుంటామని కేసీఆర్ వెల్లడించారు. ఇండియా, ఎన్డీఏ కూటముల్లో ఉండాల్సిన అవసరం లేదని, తాము ఒంటరిగా ఏమీ లేమని, తమతో కలిసి నడిచే మిత్రులున్నారని స్పష్టంచేశారు. దేశంలో 50 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నది ఆ కూటముల వారేనని, అయినా మార్పు రాలేదని గుర్తుచేశారు. దేశంలో నూతన మార్పు జరగాల్సిందేనని పునరుద్ఘాటించారు.

KCR on INDIA Alliance and NDA : మహారాష్ట్రలో సంపదకు కొదవ లేదని.. అద్భుతమైన వనరులున్నాయని కేసీఆర్ తెలిపారు. అయినా ఏ పట్టణానికి వెళ్లినా తాగునీటి కొరత వేధిస్తోందని పేర్కొన్నారు. దళిత సమాజం ఇప్పటికీ వెనుకబడే ఉందని.. వారు ఏం పాపం చేశారని విమర్శించారు. అమెరికా వంటి దేశంలో వివక్షను విడిచిపెట్టి, నల్ల జాతీయుడు బరాక్‌ ఒబామాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని.. వివక్ష పాపాలను కడిగేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఒబామా అధికారం చేపట్టాక.. నల్ల జాతీయుల జీవితాల్లో మార్పు వచ్చిందని.. భారత్‌లోనూ ఆ దిశగా పరివర్తన జరగాలని ఆకాంక్షించారు. మాతంగి సమాజానికి బీఆర్​ఎస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అంతకుముందు వాటేగావ్‌లో అన్నా భావూ సాఠే 103వ జయంతి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ప్రముఖ మాతంగి దళిత కవి, దేశం గర్వించదగ్గ ప్రజాకవి, అన్నా భావూ సాఠే అని కొనియాడారు. అన్నా భావ్‌కు భారతరత్న ఇవ్వాలని.. మహారాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసి పంపాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన పేరును దిల్లీకి పంపిస్తామని.. ప్రధానమంత్రికి తాను స్వయంగా లేఖ రాస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రి మహారాష్ట్ర పర్యటనలో ఆయన వెంట ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్, మహారాష్ట్ర బీఆర్​ఎస్ ఇంచార్జ్‌ వంశీధర్‌ రావు వెళ్లారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.