కార్తిక మాసం చివరి రోజు సందర్భంగా హైదరాబాద్ బన్సీలాల్‌పేట్ గాంధీ నగర్ కాలనీలోని నాగదేవత ఆలయంలో కార్తిక మాస వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం రాత్రి స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అన్నపూర్ణా సమేత నీలకంఠుడు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చాడు. మహిళా భక్తులంతా శివుడికి పాలు పుష్పాలతో అభిషేకాలు చేశారు. రాత్రి సమయంలో ఆలయంలో మహిళా భక్తులు కార్తిక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు... అరెస్టులు