కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు స్పందించిన విధానంపై రాష్ట్ర ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ స్పందించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ రాష్ట్రాలకు గుండు సున్నా ఇచ్చిందన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత 70 సంవత్సరాల కాలంలో దేశంలో ఆర్థిక క్రమశిక్షణ లేదనడం హాస్యాస్పదం అన్నారు. 2014 తర్వాత ప్రధాని మోదీ వచ్చిన తర్వాతనే బాగుందనడం సరికాదన్నారు. గతంలో భాజపా ప్రభుత్వం కూడా అధికారంలో ఉందన్న విషయం వారు మరచిపోయారని అన్నారు. సంకుచ స్వభావం మీదా.. సీఎం గారిదా అని ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడవచ్చనే సమయంలో నవ్వుల పాలవుతామనే విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని అన్నారు.
ఇదీ చూడండి : 'భిక్షం వేయడానికి మేము నిజాం అడుగు జాడల్లో నడవట్లేదు'