ETV Bharat / state

కనిగిరి దుర్గం బాప్టిస్ట్​ చర్చి @128 ఏళ్లు - కనిగిరి పురాతన చర్చి

కనిగిరిలోని దుర్గం బాప్టిస్ట్ చర్చి రికార్డు సృష్టిస్తోంది. చర్చి నిర్మాణం జరిగి నేటికి 128 ఏళ్లు కావొస్తున్నా ఏమాత్రం చెక్కుచెదరలేదు. దీన్ని బ్రాక్​ దొర నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. కోడి గుడ్డు సొన, గానుగ సున్నం ఈ చర్చి నిర్మాణానికి ఉపయోగించారని... అందువల్ల నేటికి పటిష్ఠంగా ఉందని చరిత్ర కారులు చెబుతున్నారు.

kanigiri-durgam-baptist-church-construction-completed-128-years
కనిగిరి దుర్గం బాప్టిస్ట్​ చర్చి @128 ఏళ్లు
author img

By

Published : Dec 25, 2020, 2:26 PM IST

ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఉన్న దుర్గం బాప్టిస్ట్​ చర్చి నిర్మాణం జరిగి 128 ఏళ్లు పూర్తి కావొస్తున్న ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఈ చర్చ్​ను బ్రిటీష్ హయాంలో 1892లో రెవరెండ్ బ్రాక్ దొర నిర్మించారు. 1910 నుంచి ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నట్టు ఆధారాలు చెబుతున్నాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగి కట్టడాల్లో ఇది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇదంతా ఒకెత్తైతే ఆ రోజుల్లోనే సాంకేతికతతో అమర్చిన పెద్ద గంట మరో ఎత్తు. రంగూన్ టేకుతో తయారుచేయించిన కిటికీలు, ధర్వాజాలు నేటికీ చెక్కు చెదరలేదు.

kanigiri-durgam-baptist-church-construction-completed-128-years
కనిగిరి దుర్గం బాప్టిస్ట్​ చర్చి @128 ఏళ్లు

కోడి గుడ్డు సొన, గానుగ సున్నం ఈ చర్చి నిర్మాణానికి ఉపయోగించారని, అందువల్ల ఈ నిర్మాణం నేటికి చెక్కు చెదరకుండా ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. సువిశాల స్థలములో నిర్మించిన ఈ చర్చి బ్రిటీష్ వారి మేధస్సుకు నిదర్శనంగా నిలుస్తోంది.

కావ్వంట్​ చర్చిలో క్రిస్మస్​ వేడుకలు...

ప్రకాశం జిల్లా లో క్రిస్మస్ సంబురాలు జరుగుతున్నాయి. ఇంకొల్లు మండలం సూది వారి పాలెం కావ్వంట్ చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జీ.రామారావు గ్రామ సంఘ పెద్దలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పిల్లలు ఆటపాటలతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. క్రీస్తు భక్తి గీతాలకు అనుగుణంగా చిన్నారులు నృత్యాలు చేశారు

ఇదీ చదవండి: రాష్ట్రంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.