Kangana Ranaut in Green India Challenge : పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా మానవ జీవితం అల్లకల్లోలం కాకుండా పచ్చదనంతో కళకళలాడాలనే ఉద్దేశంతో, తెలంగాణలో వనాలను పెంచడమే లక్ష్యంగా అడుగులు వేయడానికి రాజ్యసభ సభ్యుడు ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ ప్రారంభించిన మహోత్తరమైన కార్యక్రమం గ్రీన్ఇండియా ఛాలెంజ్. ఈ మహా క్రతువులో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ భాగస్వామ్యం అవుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు.
Kangana Ranaut participated in Green India Challenge : రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో పంచవటి పార్క్‌లో కంగనా రనౌత్ మొక్కలు నాటారు. ప్రముఖ జ్యోతిష్యుడు బాలు మున్నంగి ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటినట్లు కంగనా రనౌత్ పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా రాజ్యసభ ఎంపీ సంతోశ్ కుమార్ కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయం అని కొనియాడారు. ఈ కార్యక్రమం ద్వారా అందరిలో పచ్చదనంపై అవగాహన వస్తుందన్నారు. ఈ ఛాలెంజ్‌ను అందరూ స్వీకరించి మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంచాలని కోరారు. అనంతరం తన సోదరి రంగోలి చందర్, డాక్టర్ రీతూ రనౌత్ , అంజలీ చౌహాన్లను గ్రీన్ ఇండియో ఛాలెంజ్‌లో మొక్కలు నాటాలని కంగనా రనౌత్ నామినేట్ చేశారు.
'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' అంటే.. హరితహారంలో ప్రతి వ్యక్తి తమ వంతు భాగస్వామ్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను సంతోశ్ కుమార్ ప్రారంభించారు. తను మొక్క నాటి మరో ముగ్గురిని నామినేట్ చేయడమే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్దేశం. కార్యక్రమంలో భాగంగా పలువురు జాతీయ నాయకులు , రాష్ట్ర ప్రముఖులు, నేతలు, అధికారులు, క్రీడాకారులు, సినీనటులు, వివిధ వర్గాల వారు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
ఇవీ చదవండి: