ప్రపంచంలోనే అతిపెద్ద యోగాకేంద్రం ఈనెల 28న ప్రారంభంకానుంది. హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ వెళ్లేదారిలో చేగూరు గ్రామంలోని కన్హాశాంతి వనంలో నిర్మించిన భారీ మెడిటేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. హార్ట్ ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో 30 ఎకరాల విస్తీర్ణంలో లక్ష మంది ఒకే చోట మెడిటేషన్ చేసేందుకు వీలుగా దీనిని నిర్మించారు.
ఆ సంస్థ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మెడిటేషన్ కేంద్రం ఐకానిక్ డిజైన్గాను నిలవనుంది. ఈ నెల 28న హార్ట్ ఫుల్నెస్ సంస్థ గ్లోబల్ గైడ్ దాజి దీనిని ప్రజలకు అంకితం చేయనున్నారు. కార్యక్రమానికి ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ హాజరుకావొచ్చని సమాచారం.
ఇదీ చూడండి: రేపు సాయంత్రంలోగా రానున్న మున్సిపల్ ఫలితాలు