ETV Bharat / state

న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుదాం: కేఏ పాల్‌ - ka paul

HIGH COURT LAWYERS PROTEST: ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ సిఫారసులను తక్షణం నిలిపేయాలని కోరుతూ హైకోర్టు వద్ద న్యాయవాదులు నిరసన చేశారు. సిఫారసులను పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు కొలీజియంను కోరారు. న్యాయవాదులకు మద్దతుగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ నిరసనలో పాలొన్నారు.

HIGH COURT LAWYERS PROTEST
న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుదాం
author img

By

Published : Dec 31, 2022, 11:36 AM IST

HIGH COURT LAWYERS PROTEST AGAINST JUDGES TRANSFERS: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ల బదిలీ సిఫారసులను నిలిపేయాలని హైకోర్టు వద్ద న్యాయవాదులు నినాదాలు చేశారు. సిఫారసులను పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు కొలీజియంను కోరారు. ఇరువురు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టులోనే కొనసాగించాలని నినదించారు. ఏపీ అడ్వొకేట్స్‌ ఐకాస కన్వీనర్లు వై.కోటేశ్వరరావు(వైకే), జడ శ్రావణ్‌కుమార్‌, డీఎస్‌ఎన్వీ ప్రసాదబాబు, జీవీ శివాజీ, వాసిరెడ్డి ప్రభునాథ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో హైకోర్టు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

న్యాయవాదులకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ కేఏ పాల్‌ మద్దతు పలికారు. ‘న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుదాం’ అని ప్లకార్డును ప్రదర్శించారు. ఏపీ హైకోర్టు జడ్జిలను బదిలీ చేయవద్దని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌కి విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులు అప్పసాని వినీత్‌, దేవవరపు రాంబాబు, పెనుమాక వెంకటరావు, అంచ పాండురంగారావు, కేకే దుర్గాప్రసాద్‌, కంచర్లపల్లి శివరామప్రసాదు, కోట వెంకటరామారావు, ఎం.శివకుమార్‌, నల్లూరి మాధవరావు, పొట్లూరి సుదీప్తి, కోట కృష్ణదీప్తి, జి.స్వరాజ్యం, ఎన్‌.రజని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.