Judicial Inquiry on Medigadda Barrage : గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనమండలిలో 12 మంది సభ్యులు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇందుకు సమాధానం చెప్పారు. ఆరు హామీల అమలుతోపాటు ఏడోది ప్రజాస్వామ్య పాలన అందిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా పేదవాడి ఆరోగ్యం కాపాడేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద సాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని అన్నారు.
నాలుగు కోట్ల మంది ఆకాంక్షలు నెరవేరాలి : హైదరాబాద్ నమూనాను ప్రజల ముందు పెట్టామని రేవంత్‌రెడ్డి అన్నారు. మూసీ కారిడార్‌ను సంపూర్ణంగా అభివృద్ధి చేసి గంగా నీటితో సమానంగా పవిత్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విపక్షం సహేతుకమైన సలహాలు ఇవ్వాలని, అందుకు తమ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. నాలుగు కోట్ల మంది ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్లే శాసనసభలోనూ చెప్పారు : హరీశ్‌రావు
Revanth Reddy on Medigadda Barrage : గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా తట్టుకుని నిటారుగా నిలబడ్డాయని రేవంత్‌రెడ్డి అన్నారు. గత సర్కార్ నిర్మించిన మేడిగడ్డ ( Medigadda Barrage)మూడేళ్లలో కుంగిపోయిందని, అన్నారం బ్యారేజీ పగిలిపోయిందని విమర్శించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అక్కడకు తీసుకెళ్లి చూపిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.
"మా ప్రభుత్వాల హయాంలో నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్, జూరాల ప్రాజెక్టులు కట్టాం. దశాబ్దాలుగా ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా తట్టుకున్నాయి. అవన్నీ కళ్లముందే సజీవంగా ఉన్నాయి. అదే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం ప్రాజెక్టు పగిలిపోయింది. అందులోని అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తాం. అందుకు కారణమై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం." - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
Revanth Reddy Vs Kavitha : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేతిలోనే ప్రభుత్వం ఉంది కదా? కాళేశ్వరం విషయంలో నిపుణులతో ఎలాంటి పరీక్షకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కవిత వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి నిష్పక్షపాత విచారణ కోసమే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ విషయంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు తమ వైఖరి చెప్పాలని ఆయన కోరారు.
'సీఎం రేవంత్ రెడ్డికి పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియదు'
"సీఎం చెప్పిందే పదే పదే చెబుతున్నారు. మేడిగడ్డ, అన్నారంలో ఘోరాలు జరిగిపోయాయని అంటున్నారు. మీ చేతిలో ప్రభుత్వం ఉంది. నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి. కానీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను తీసుకెళ్లడానికి అదేమైనా టూరిస్ట్ స్పాటా. తప్పు జరిగితే అది నిర్ధారణ చేయాల్సని పని నిపుణులది. ఇందుకోసం ఎలాంటి పరీక్షకైనా సిద్ధంగా ఉన్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు." - కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
మరోవైపు నిజాం, డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులకు మెరుగైన బీమాను తీసుకురావటంపై కసరత్తు చేస్తున్నామన్నారు. మైనార్టీలకు బీఆర్ఎస్ నకిలీ చెక్కులు ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ రాజకీయ పునరావస కేంద్రంగా మారిందని, గ్రూప్-1, 2 పరీక్షల నిర్వహణను బాధ్యతను అవగాహన లేనివారికి అప్పగించిందని మండిపడ్డారు. ఏడాదిలోగా 2 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వానిది : సీఎం రేవంత్ రెడ్డి
ఇప్పుడైనా ఇతరులకు అవకాశం ఇస్తారనుకుంటే మళ్లీ వారే మాట్లాడుతున్నారు : రేవంత్ రెడ్డి