ETV Bharat / state

'భారతీయులు లేకపోతే సిలికాన్​ వ్యాలీ ఈ స్థాయిలో ఉండేది కాదు' - 'భారతీయులు లేకపోతే సిలికాన్​ వ్యాలీ ఈ స్థాయిలో ఉండేది కాదు'

హైదరాబాద్​ సాఫ్ట్​వేర్​ ఎంటర్​ప్రైజెస్​ అసోసియేషన్​(హైసియా) ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్​ సమ్మిట్​లో ముఖ్యఅతిథిగా అమెరికా కాన్సుల్​ జనరల్​ జోయల్​ రీఫ్​మ్యాన్​ పాల్గొన్నారు. భారత్​, అమెరికా దేశాల మధ్య వాణిజ్యం పెరిగిందని వెల్లడించారు.

Joel_Reifman_At_Hysea_Biz_Summit
'భారతీయులు లేకపోతే సిలికాన్​ వ్యాలీ ఈ స్థాయిలో ఉండేది కాదు'
author img

By

Published : Jan 23, 2020, 9:49 PM IST

భారతీయులు లేకపోతే సిలికాన్ వ్యాలీ ప్రస్తుతం ఉన్న స్థాయిలో ఉండేది కాదని అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్​మ్యాన్ అన్నారు. హైటెక్ సిటీలో హైదరాబాద్ సాఫ్ట్​వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) ఆధ్వర్యంలో మొదటి సారి బిజినెస్ సమ్మిట్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన... అమెరికాలోని పలు పెద్ద కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారన్నారు.

వస్తు సేవల వాణిజ్యం ఇరు దేశాల మధ్య 2018లో 143 బిలియన్ డాలర్లకు చేరిందని, 2016తో పోల్చితే ఇది మూడు రెట్లు పెరుగుదల అని వెల్లడించారు. పది సంవత్సరాల క్రితం రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం దాదాపు శూన్యంగా ఉండేదని, ప్రస్తుతం 18 బిలియన్ డాలర్లకు చేరిందని తెలిపారు.

'భారతీయులు లేకపోతే సిలికాన్​ వ్యాలీ ఈ స్థాయిలో ఉండేది కాదు'

ఇవీ చూడండి: దావోస్​లో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.