ETV Bharat / state

స్వప్నలోక్​ భవనాన్ని కూల్చాలా.. వద్దా..? పరిశీలించిన జేఎన్టీయూ టీమ్ - స్వప్నలోక్​ భవనాన్ని పరిశీలించిన జేఎన్టీయూ బృందం

JNTU Team Visit Swapnalok building Fire Accident: సికింద్రాబాద్​లోని స్వప్నలోక్​ భవనాన్ని జేఎన్టీయూ బృందం పరిశీలించింది. భవనాన్ని కూల్చేయాలా లేక మరమ్మతులు చేయాలా అనే విషయంపై పరీక్షల తర్వాత వస్తుందని బృందం చెప్పింది. ఈ పరీక్ష నిర్వహించేందుకు కనీసం మూడురోజులు పడుతుందని.. ఆ తర్వాత నిర్ణయం తెలుపుతామని తెలిపింది.

swapnalok shopping mall
swapnalok shopping mall
author img

By

Published : Mar 18, 2023, 7:00 PM IST

JNTU Team Visit Swapnalok building Fire Accident: గురువారం అగ్ని ప్రమాదానికి గురైన స్వప్నలోక్​ భవనాన్ని జేఎన్టీయూ బృందం పరిశీలించింది. స్వప్నలోక్​ బిల్డింగ్​లోని నాలుగు, ఐదు, ఆరు అంతస్తులను జేఎన్టీయూ బృందం ప్రొఫెసర్​ లక్ష్మి, హెచ్​ఓడీ డీఎన్​ కుమార్​ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. భవనంలోని ఐదో అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ.. నాలుగు, ఆరు అంతస్తుల్లో ఈ ప్రమాద తీవ్రత కారణంగా కొంత దెబ్బతిన్నట్లు బృంద ప్రతినిధులు నిర్ధారణకు వచ్చారు.

భవన నాణ్యతా ప్రమాణాలను, కాలమ్స్​, బీమ్స్​, స్లాబ్​ పరీక్షలు నిర్వహించిన అనంతరం నివేదిక అందజేస్తామని తెలిపారు. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత భవనాన్ని కూల్చేయాలా లేక మరమ్మతులు చేయాలా అనే విషయంపై స్పష్టత వస్తుందని బృంద ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ పరీక్షలు నిర్వహించేందుకు రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.

గతంలో దక్కన్​ మాల్​ కూల్చివేత: స్వప్నలోక్​ కాంప్లెక్స్​ అగ్ని ప్రమాద ఘటన జరగడానికి ముందు జనవరి 19న సికింద్రాబాద్​లోని దక్కన్​ మాల్​లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అప్పట్లో ఈ భవన నిర్మాణాన్ని పరిశీలించిన జేఎన్టీయూ అధికారులు ఏ క్షణమైనా భవనం కూలిపోయే అవకాశం ఉందని చెప్పడంతో.. జీహెచ్​ఎంసీ అధికారులు భవనాన్ని కూల్చివేశారు. ఐదంతస్తుల దక్కన్​మాల్​ భవనం కూల్చివేత ఐదురోజులు సాగింది.

అసలేం జరిగింది: సికింద్రాబాద్​లోని స్వప్నలోక్​ కాంప్లెక్స్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాంప్లెక్స్​లోని ఏడో అంతస్తులో మంటలు షార్ట్​ సర్క్యూట్​ కారణంగా వ్యాపించాయి. అయితే సడన్​గా ఐదో అంతస్తులో పేలుడు సంభవించి అగ్ని కీలలు ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో ఈ భవనంలో ఉన్న వారందరూ హుటాహుటిగా భయంతో పరుగులు తీశారు. ఐదో అంతస్తులో కాల్​సెంటర్​లో నలుగురు యువతిలు, ఇద్దరు యువకులు చిక్కుకుపోయారు. దట్టమైన పొగ లోపల కమ్మేయడంతో వారు ఊపిరి ఆడక చనిపోయారు.

మరికొంత మంది ఆ పొగకు స్ప్శహ తప్పి పడిపోయారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది వారిని రక్షించి.. చికిత్స అందించారు. అయితే మంటలు విపరీతంగా వ్యాపించడం, దట్టమైన పొగలు కమ్మడంతో సహాయక సిబ్బంది లోపలికి వెళ్లలేక పోయారు. సికింద్రాబాద్​లోని దక్కన్​ మాల్​ ఘటన మరువక ముందే ఇప్పుడు ఈ ప్రమాదం జరగడంతో.. అసలేం జరుగుతుందో అర్థంకాకా స్థానికులు భయాందోళనలో ఉన్నారు.

ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన ఆరుగురుకి ఒక్కొక్కరి రూ. 5 లక్షల చొప్పున రాష్ట్రం ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా మృతి చెందిన ఒక్కొక్కరికీ రూ. 2లక్షలు.. క్షతగాత్రులకు రూ. 50వేలును పరిహారంగా ప్రకటించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.