ETV Bharat / state

అంచనాలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఫలితాలు - అలుగు బెల్లి నర్సిరెడ్డి

శాసనమండలి ఎన్నికల్లో ఆదిలాబాద్​-కరీంనగర్​-నిజామాబాద్​-మెదక్​ పట్టభద్రుల స్థానం నుంచి జీవన్​ రెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించారు. వరంగల్​-నల్గొండ-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొందారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు
author img

By

Published : Mar 27, 2019, 9:09 AM IST

Updated : Mar 27, 2019, 11:49 AM IST

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అనూహ్యం
శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. శాసనమండలి చీఫ్​ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్​ ఓటమి పాలయ్యారు. ఆదిలాబాద్​-కరీంనగర్​-నిజామాబాద్​-మెదక్​ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్​ అభ్యర్థి జీవన్​ రెడ్డి విజయం సాధించారు. ఇవే జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ స్థానంలో పాతూరి సుధాకర్​ రెడ్డిపై పీఆర్​టీ​యూ టీఎస్​ అభ్యర్థి కూర రఘోత్తంరెడ్డి గెలుపొందారు. వరంగల్​-నల్గొండ-ఖమ్మం ఉపాధ్యాయ మండలి ఎన్నికల్లో సిట్టింగ్​ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్​పై యూటీఎఫ్​ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయభేరి మోగించారు.

పార్టీలకు అతీతంగా జరుగుతున్నందున తెరాస ఎవరికి బీ ఫారాలను ఇవ్వలేదు. సుధాకర్​ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా, పూల రవీందర్ పీఆర్టీయూ తరఫున పోటీ చేశారు. వీరికి తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరికొందరు ప్రజాప్రతినిధులు పరోక్షంగా మద్దతు ఇచ్చారు.

జీవన్​రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. నర్సిరెడ్డికి వామపక్షాలు, హస్తం పార్టీ​, పలు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. పలు ఉపాధ్యాయ సంఘాలు బలపర్చడం వల్ల పీఆర్టీయూ టీఎస్​ అభ్యర్థి రఘోత్తంరెడ్డి విజయం సాధించారు.

ఇదీ చూడండి :బ్యాలెట్​ పోలింగ్​కు ఇందూరు సిద్ధం

Intro:Body:Conclusion:
Last Updated : Mar 27, 2019, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.