ETV Bharat / state

ప్రభుత్వం కరోనా రోగులకు విశ్వాసం కల్పించలేకపోతుంది: జీవన్​రెడ్డి - తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 2020

కరోనా చికిత్సకై కార్పొరేట్​ ఆసుపత్రులు ఇష్టానుసారంగా బెడ్ ఛార్జ్​ చేస్తున్నారని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వంపై వారికి విశ్వాసం కల్పించడం ద్వారా ఈ ప్రైవేటు దోపిడీని నివారించవచ్చని ఆయన మండలి వేదికగా తెలిపారు.

jeevan reddy spoke about corporate hospitals Performance in presence of assembly
ప్రభుత్వం కరోనా రోగులకు విశ్వాసం కల్పించలేకపోతుంది: జీవన్​రెడ్డి
author img

By

Published : Sep 10, 2020, 2:32 PM IST

ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు కల్పించినప్పటికీ కరోనా వ్యాధిగ్రస్తులకు విశ్వాసం కల్పించలేక పోవడం వల్ల వారు కార్పొరేట్​ ఆసుపత్రిని ఆశ్రయించాల్సి వస్తుంది. దానితో ప్రైవేటు యాజమాన్యం పేదలను దోచుకుంటుంది. ఈ దోపిడీని ప్రభుత్వమే నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి పేర్కొన్నారు. కొవిడ్​ రోగులకు ఇచ్చిన ఇన్​సెన్​టివ్​ కేవలం రెండు మాసాలకే పరిమితం చేయడం బాధాకరమని.. దాన్ని మరో ఆరు మాసాలు ఇవ్వడానికి ప్రయత్నించడని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వం కరోనా రోగులకు విశ్వాసం కల్పించలేకపోతుంది: జీవన్​రెడ్డి

గత నెలలో ఒక్క జగిత్యాల జిల్లాలోనే సుమారు రోజుకు 300 కేసులు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం చూపిస్తున్న లెక్కల్లో మాత్రం 100లోపే ఉంటున్నాయన్నారు. మంత్రి ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్​జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీయూ స్కాన్​ పనిచేయకపోవడం వల్ల ప్రజలపై భారం పడుతోంది. కాబట్టి దానిని ఏర్పాటు చేయాలని కోరారు. కరోనా కట్టడికై టాస్క్​ఫోర్స్​ ఏర్పాటు చేస్తామన్నారు సంతోషకరమని.. త్వరితగతిన కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. కరోనా నివారణ చికిత్సకై కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్​ భారత్​ను పొందడం మన హక్కు అని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి: రఫేల్​ జెట్ల​ విన్యాసాలు- శత్రువుల గుండెల్లో గుబులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.