హైదరాబాద్ లో జాతీయ స్థాయి వర్చువల్ కేర్ ఫెయిర్ ను ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. కరోనా సమయంలో సాంకేతిక పరిజ్ఞానంతో వర్చువల్ జాబ్ ఫెయిర్ ను నిర్వహించడం అభినందనీయమన్నారు.
గురునానక్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే జాబ్ మేళాను ఈ ఏడాది జాతీయస్థాయిలో తొలిసారిగా వర్చువల్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వైస్ ఛైర్మన్ జీఎస్ కోయిల్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 40 ప్రముఖ కంపెనీలు 2,500 ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే 10వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. 2017 నుంచి 2021 వరకు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.