ETV Bharat / state

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా - ఆమోదించని గవర్నర్ - TSPSC news today

TSPSC Chairman Janardhan Reddy Resigned : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ పదవికీ జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. అలాగే కమిషన్‌ సభ్యులు సైతం రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియపై సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు.

TSPSC Chairman Janardhan Reddy resigned
Janardhan Reddy resigned from the post of TSPSC Chairman
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2023, 9:25 PM IST

Updated : Dec 12, 2023, 11:46 AM IST

TSPSC Chairman Janardhan Reddy Resigned : టీఎస్​పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి ఆ మేరకు సమాచారమిచ్చారు. అనంతరం రాజ్​భవన్​కు వెళ్లి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన రాజీనామాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని రాజ్ భవన్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. సోమవారం రోజున టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌ రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని ప్రకటనలో పేర్కొంది. మరోవైపు కమిషన్‌ సభ్యులు కూడా రాజీనామా చేయనున్నట్టు సమాచారం.

2021 మేలో జనార్దన్‌ రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వం హయాంలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. వరుస పేపర్‌లీకేజీల నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయి రాజీనామా చేశారు.

గత ప్రభుత్వ హయాంలో గ్రూప్‌-1, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, ఏఈఈ ప్రశ్నపత్రాలు లీకవటం కలకలం సృష్టించింది. టీఎస్​పీఎస్సీలో పనిచేసే ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి పలు ప్రశ్నపత్రాలు తస్కరించి, బయటి వ్యక్తులకు విక్రయించినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ, ఏఈఈ, డీఏవో పరీక్షలను కమిషన్‌ రద్దు చేసింది. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ పరీక్షల తేదీలను మార్చింది.

గత సర్కార్‌ నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన వంద మందికి పైగా నిందితులను అరెస్టు చేసింది. వారు ఇకపై పరీక్షలు రాయకుండా కమిషన్‌ డీబార్‌ చేసింది. అనంతరం ఓఎమ్​ఆర్ విధానంలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. గ్రూపు సర్వీసులకు మినహా మిగతా పరీక్షలన్నింటికి సీబీఆర్టీ విధానంలో, ఎక్కువ మంది ఉంటే నార్మలైజేషన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించారు.

Janardhan Reddy Resigned post of TSPSC Chairman : ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలోనూ లోపాలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. లోపాలు నిజమేనని పేర్కొంటూ న్యాయస్థానం పరీక్షను రద్దుచేయడంతో కమిషన్‌పై నిరుద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబికింది. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశంలో ఛైర్మన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. టీఎస్​పీఎస్సీ(TSPSC) బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు డిమాండ్ చేశారు.

ఈసారైనా గ్రూప్‌-2 పరీక్ష షెడ్యూల్ ప్రకారం జరిగేనా - వచ్చే వారంలో క్లారిటీ

నియామక పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో కమిషన్ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేయాలని జనార్దన్‌రెడ్డి నిర్ణయించుకోగా గత ప్రభుత్వం తిరస్కరించింది. జరిగిన పొరపాట్లను సరిదిద్ది, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించటంతో ఆయన నిర్ణయాన్ని విరమించుకున్నారు. రెండోసారి నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను సైతం హైకోర్టు రద్దు చేయడంతో నిరుద్యోగుల్లో మరోసారి ఆగ్రహం తీవ్రమైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బోర్డును ప్రక్షాళిస్తామని హామీ ఇచ్చాయి. తాజాగా ప్రభుత్వం మారడంతో ఎట్టకేలకు ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

TSPSC Chairman Janardhan Reddy Resigns : మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, ప్రశ్నపత్రాల లీకేజీ, తదుపరి నియామక ప్రక్రియపై సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్‌-2 పరీక్ష, గ్రూప్‌-1 ప్రశ్నపత్రం లీకేజీ, గ్రూప్‌-3 షెడ్యూలు ఖరారు, ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షలకు సంబంధించిన తదుపరి ప్రక్రియపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

Revanthreddy on TSPSC Board : టీఎస్​పీఎస్సీ బోర్డు.. రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది : రేవంత్​రెడ్డి

గ్రూప్‌-1 ప్రకటనపై కొత్త ప్రభుత్వం నిర్ణయమే కీలకం - మరీ చిక్కుముడి వీడేదెలా?

Last Updated : Dec 12, 2023, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.