Jalamandali on Vaddera basti Issue: మాదాపూర్ వడ్డెరబస్తీలో ప్రజల అనారోగ్యానికి తాము సరఫరా చేసే నీరు కారణం కాదని... జలమండల స్పష్టం చేసింది. ఆ బస్తీలో సరఫరా అయిన మంచినీటిలో 44 శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు జరిపిన జలమండలి.. ఆ నీటిలో తగు మొతాదులో క్లోరిన్ ఉందని తెలిపింది. అందులో ఎలాంటి బాక్టీరియా ఆనవాళ్లు కూడా లేవని ఈ పరీక్షల్లో తేలినట్లు వివరించింది. ఘటన జరిగిన ప్రదేశంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ నీరు సురక్షితమైందని పరీక్షల్లో తేలింది. ప్రజలు ఎలాంటి అనుమానాలు లేకుండా... జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిని తాగవచ్చని స్పష్టం చేసింది.
ఈ నీటిలో ఎలాంటి బ్యాక్టీరియా కూడా లేదని ప్రాథమికంగా తేలింది. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు, చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా నీరు సురక్షితమైనదని పరీక్షల్లో తేలింది. వడ్డెరబస్తీ ఘటనకు జలమండలి సరఫరా చేసిన మంచినీరు కారణం కాదని అందరూ గుర్తించాలని కోరారు. ఈ ప్రాంత ప్రజలకు జలమండలి నీటిపై ధైర్యం కల్పించేందుకు ప్రజల ముందే జలమండలి సిబ్బంది ఈ బస్తీలో సరఫరా అయిన నీటిని తాగి చూపించారు. ఈ ఘటనకు జలమండలి నీరు కారణం కాకపోయినప్పటికీ ఈ ప్రాంతానికి సరఫరా చేస్తున్న నీటిపైన జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటర్నల్ క్యూఏటీ బృందం, ఐపీఎం, థర్డ్ పార్టీ బృందాల ద్వారా నీటిని పరీక్షించగా ఇక్కడి నీరు సురక్షితమైనదిగా వెల్లడైంది. ప్రజలు ఈ విషయంలో ఎలాంటి ఆందోళనలకు గురి కావొద్దని జలమండలి కోరింది. చుట్టు పక్కల ప్రాంతాలైన జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ సొసైటీ, కావూరి హిల్స్, కాకతీయ హిల్స్, అయ్యప్ప సొసైటీలో ప్రాంతాల్లో కూడా నీటి నాణ్యత బాగుందని జలమండలి వెల్లడించింది.
ఇదీ చదవండి: హైటెక్ సిటీలో కలుషిత నీరు తాగి 57 మందికి అస్వస్థత