రాష్ట్రంలో మహిళలకు మంత్రి పదవులు దక్కేందుకు ఐదేళ్ల సమయం పట్టిందని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాణి రుద్రమదేవి నుంచి మహిళలు ఎన్నో ఉద్యమాలు చేశారని పేర్కొన్నారు. వైఎస్ షర్మిల తన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళల మధ్య నిర్వహించిన మహిళా దినోత్సవంలో షర్మిల పాల్గొని పలువురు మహిళలను సన్మానించారు.
చట్టసభల నుంచి ఉద్యోగ అవకాశాల వరకు మహిళలకు నిర్దిష్ట కోటా ఉండాలని షర్మిల స్పష్టం చేశారు. అందుకోసం తాను కొట్లాడతానని ఆమె తెలిపారు. అంతకు ముందు వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. లైన్మెన్ భారతి, ఈత, తాటి చెట్లు ఎక్కి కల్లు తీస్తు జీవనం సాగిస్తున్న సావిత్రి, ఖమ్మంలో వనిత గ్యారేజ్ నడుపుతున్న ఆదిలక్ష్మిని షర్మిల ఘనంగా సన్మానించారు.