ETV Bharat / state

రూ.2.80 కోట్ల కారు విషయంలో.. చీకోటి ప్రవీణ్‌కు ఐటీ నోటీసులు

Chikoti Praveen: ఇప్పటికే ఈడీ దాడులతో సతమతవుతున్న క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కు.. పుండు మీద కారం జల్లినట్లు ఇప్పుడు ఐటీ నోటీసులు ఇచ్చింది. ఖరీదైన కారు విషయంలో ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటీ ఆ విషయం చూద్దామా..!

Chikoti Praveen
చీకోటి ప్రవీణ్‌
author img

By

Published : Feb 28, 2023, 12:37 PM IST

IT Notices For Cheekoti Praveen: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో.. రూ.2.8 కోట్ల విలువైన కారుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. రేంజ్‌ రోవర్‌ కారు విషయంలో ఈ నోటీసులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. ఆ కారు తన స్నేహితుడి సంస్థకు చెందినదని.. అవసరమున్నప్పుడు దానిని వాడుకుంటున్నట్లు అధికారులకు ప్రవీణ్‌ తెలిపాడు. అయితే అధికారులు మాత్రం ఇది ప్రవీణ్‌ బినామీ సంస్థ పేరుతో కొనుగోలు చేసిన కారుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫెమా నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడ్డాడని ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఐటీ కూడా నోటీసులు పంపించడంతో.. ఈ విషయంలో అన్ని వైపుల నుంచి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

క్యాసినో వ్యవహారంపై మొన్నటివరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రంగంలోకి దిగగా, ఇప్పుడు ఐటీశాఖ రంగంలోకి దిగింది. ఇప్పటికే క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ను కీలక సూత్రధారిగా పరిగణించి.. ప్రవీణ్‌కు సంబంధించిన ఇళ్లల్లో, సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. కొన్ని నెలల క్రితం ప్రవీణ్‌ను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించింది. అసలు విదేశాలకు ఇక్కడ నుంచి సినీ ప్రముఖులను, రాజకీయ నాయకులను తరలించడంపై ప్రత్యేకంగా ప్రశ్నించింది.

బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను కూడా నిశితంగా పరిశీలించింది. ప్రవీణ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులను కూడా ఈడీ ప్రశ్నించింది. విదేశీ క్యాసినో అక్రమాలపై జరిగిన హవాలా లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఐటీ సైతం రేంజ్‌ రోవర్‌ కారు విషయంలో నోటీసులు పంపించింది.

ఈడీ ప్రధాన అభియోగం: క్యాంపుల్లో జూదం ఆడేందుకు పంటర్లకు కావాల్సిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గరి నుంచి.. పంటర్లు గెలుచుకున్న సొమ్మును నగదు రూపంలో మార్చి అప్పజెప్పడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడిచిందనేదని ఈడీ ప్రధాన అభియోగం.. దీని ప్రకారమే దర్యాప్తును ముందుకు తీసుకువెళుతుంది.

నేపాల్‌, శ్రీలంక, హాంగ్‌కాంగ్‌ తదితర దేశాల్లో నిర్వహించిన క్యాసినో క్యాంపులకు కొంత మంది సెలబ్రటీలను పంపినట్లు ఇప్పటికే ఈడీ ఆధారాలను సేకరించింది. వారికి దగ్గరుండి.. వారి అన్ని అవసరాలను తీర్చారు. క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గర నుంచి పంటర్లు గెలుచుకునే సొమ్మును నగదు రూపంలో అప్పజెప్పడం వంటి బాధ్యతను ప్రవీణ్ బృందమే దగ్గరుండి చూసుకుందని ఈడీ ప్రాథమికంగా ఆధారాలు సేకరించింది. ఈ హవాలా మార్గంలో సొమ్మును సేకరించి.. ప్రవీణ్‌ ఆస్తులు గడించాడని ముందు నుంచి ఈడీ ప్రధానంగా ఆరోపిస్తుంది.

ఇంకా దొరకని కారు ఆచూకీ: తన ఇన్నోవా కారును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని పది రోజుల క్రితం చీకోటి ప్రవీణ్‌ సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంపై పోలీసులు నుంచి ఇంకా ఎలాంటి సందేశం రాలేదని ప్రవీణ్‌ తెలిపాడు. తనపై రిక్కీ నిర్వహించి.. ఈ వాహనం తీసుకొని వెళ్లారని చెప్పాడు. తనకు ప్రాణహాని ఉందని.. వెంటనే తనకు పోలీసులు భద్రత కల్పించాలని కోరాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.