KTR on Block Chain Technology: పోలిస్స్టేషన్లలో ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం బ్లాక్ చెయిన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఫిర్యాదుల స్వీకరణ కోసం బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి పోలీస్‌స్టేషన్‌గా ఫిరోజాబాద్ నిలిచిందన్న కథనం ఆధారంగా కేటీఆర్ ఈ సూచన చేశారు.
ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదుల స్వీకరణ కోసం ఈ విధానాన్ని అమలు చేయాలని హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలకు ఆయన సూచించారు. జవాబుదారీతనం ఉండేందుకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ బాగా ఉపయోగపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడని సాంకేతిక ఏదైనా నిరుపయోగమని ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్తుంటారని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇవీ చదవండి: