Secunderabad Gold Theft Case Updates : ఈ నెల 27న సికింద్రాబాద్ మోండా మర్కెట్ పరిధిలోని బంగారం దుకాణంలో చోరీ కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. 36 గంటల లోపే ముఠాలోని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో పాట్ మార్కెట్‌లోని బాలాజీ జ్యువెల్లరీ షాప్‌లో.. ఐదుగురు దుండగులు ఐటీ అధికారులమని పనివాళ్లని నమ్మించి.. మధుకర్‌కి చెందిన దుకాణంలో 1700 గ్రాముల బంగారంతో నిందితులు ఉడాయించారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా 5 బృందాలలతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. నిందితులు చోరీ అనంతరం జేబీఎస్ వరకూ ఆటోలో వెళ్లి అక్కడి నుంచి కేపీహెచ్‌బీ వెళ్లారు. అక్కడే మహారాష్ట్ర బస్సు ఎక్కి పరారయ్యారు. దీంతో వారి కంటే ముందుగానే బస్సు రూట్ ఆధారంగా మూడు బృందాలు మహారాష్ట్రకు వెళ్లాయి. ఈ క్రమంలోనే అక్కడి పోలీసులు సాయంతో నలుగురిని అరెస్ట్ చేశారు.
Secunderabad Gold Theft Case : మొత్తం ఎనిమిది మంది నిందితులు ఈ దొంగతనంలో పాల్గొన్నారు. అనంతరం రెండు బృందాలుగా విడిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం వారిని సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నారు. వారి ఫోన్లు స్వాధీనం చేసుకుని మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితులు నగరానికి వచ్చిన మార్గాలపై ఆరాతీస్తున్న సమయంలో.. పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఒకరికొకరు తెలియకుండా : ఈనెల 24 నుంచి 27 వరకూ ప్యాట్నీలోని దిల్లీ లాడ్జిలో నిందితులు బస చేశారు. 24న ఉదయం 7:30 గంటల సమయంలో నలుగురు, మధ్యాహ్నం 3:30 గంటలకి మరో నలుగురు వచ్చారు. రెండు బృందాలుగా వచ్చి రెండు గదుల్లో బస చేశారు. లాడ్జి మేనేజర్‌కు అనుమానం రాకుండా ఒకరికొకరు తెలియకుండా వ్యవహరించారు. ఇందులో భాగంగానే అక్కడి మేనేజర్ తిరుపతికి వేరే వ్యక్తుల ఆధార్ కార్డులు ఇచ్చారు. ఈ క్రమంలోనే మేనేజర్ తిరుపతి... గదిలో ఉంటున్న వారిలో ఎవరో ఒకరి కార్డు ఇవ్వాలని తెలిపాడు. తమ వద్ద జిరాక్స్ లేదని వాట్సప్ చేస్తామని చెప్పడంతో మేనేజర్ సరే అన్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు ఆధార్ కార్డులు వాట్సప్ చేశారు. సరేనని వారు చెప్పిన వివరాలు రాసుకున్నాడు. అనంతరం వాట్సప్ చేసిన ఆధార్ కార్డులు తర్వాత ప్రింట్ తీసుకుందామని తిరుపతి అనుకున్నాడు.
డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ : కానీ చోరీకి వెళ్లే ముందు రోజు నిందితులు.. లాడ్జి మేనేజర్ తిరుపతికి వాట్సప్ చేసిన ఆధార్ కార్డులను డిలీట్ ఫర్ ఎవ్రీవన్ కొట్టారు. దీంతో అతనికి వచ్చిన రెండు ఆధార్ కార్డులు వాట్సప్ నుంచి మాయమయ్యాయి. వచ్చిన వెంటనే వాటిని డౌన్లోడ్ చేయలేదని పోలీసులకు తిరుపతి తెలిపాడు. ఇలా రెండు రోజుల తర్వాత డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్‌ను నేరగాళ్లు ఇలా వాడుకున్నారు. ఇందులో భాగంగానే చోరీకంటే ముందు అంటే 27న ఉదయం 10:30 గంటలకు తన తల్లి చనిపోయిందని.. నిందితుల్లోని ఒకరు లాడ్జి నిర్వాహకుడికి చెప్పి హడావిడిగా ఖాళీ చేశారు.
Gold Theft Case Secunderabad : అన్‌లైన్ పేమెంట్ చేస్తే దొరికిపోతామని మూడు రోజులకు లాడ్జికి కట్టాల్సిన రూ.3,000లను నగదు రూపంలో చెల్లించి రెండు బృందాలుగా వెళ్లిపోయారు. పక్కా ప్రణాళకతో రెక్కీ చేసి మరీ దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన ప్రాంతానికి 750 మీటర్ల దూరంలోనే లాడ్జిని ఎంచుకుని నిందితులు బస చేసినట్లు నిర్ధారించారు. కాగా ఇప్పటి వరకూ ఈ కేసులో నలుగురు అరెస్ట్ కాగా.. మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: