ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

తల్లిగా, సోదరిగా, భార్యగా వివిధ రూపాల్లో ప్రేమను పంచుతూ... సృష్టికి మూలమైన మహిళను గౌరవించుకుంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మనల్ని కంటికి రెప్పలా కాపాడే స్త్రీ మూర్తిని తలుచుకుంటూ... మనసారా ధన్యావాదాలు తెలుపుకుంటున్నారు. వివిధ చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.

international-womens-day-celebrations-in-telangana
రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
author img

By

Published : Mar 8, 2021, 6:26 AM IST

రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో... అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అంటుంటారు. అందుకే సమాజంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యతే వేరు. మహిళలు గతాన్ని తలుచుకుని వేడుకలు జరుపుకోవడంతోపాటు... భవిష్యత్‌ ప్రణాళికా వేసుకునేలా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని... రాష్ట్రంలోని మహిళలకు గవర్నర్‌ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్‌ సమయంలో వివిధ రంగాల్లో మహిళలు చేసిన సేవలను కొనియాడారు.

ప్రముఖుల శుభాకాంక్షలు

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మార్చి 8న మహిళ ఉద్యోగులకు సెలవుదినంగా ప్రకటించారు. వివిధ రంగాల్లో ప్రతిభా పాటవాలు కనబర్చిన మహిళలను... స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ అభినందించారు. త్వరలోనే కొవిడ్ సమయంలో పనిచేసిన అన్ని రంగాల్లోని మహిళలను సత్కరిస్తామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. సమస్యలు ఎన్ని ఎదురైనా వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని జీహెచ్​ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అన్నారు. హైదరాబాద్‌ నగర మహిళలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

మహిళలకు సన్మానం

ప్రేమానురాగాలకు, అందమైన ప్రతిరూపానికి స్త్రీ నిదర్శనమని షాదీ ముబారక్‌ కథానాయిక దృశ్య రఘునాథ్‌ అభిప్రాయ పడ్డారు. ప్రతి మహిళ విజయం వెనక పురుషులు ఉన్నారని... ప్రస్తుతం పురుషులు మహిళలను ప్రోత్సహిస్తున్నారని ఆమె అన్నారు. హైదరాబాద్‌ సోమాజిగూడలో ఉమెన్స్‌ రైట్‌ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలకు సన్మానం చేశారు. అనంతరం చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.

నృత్య ప్రదర్శన

వి ఫర్ ఉమెన్- సొసైటీ ఫర్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ ఆధ్వర్యంలో... నారాయణగూడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరిపారు. మహిళల రక్షణ కోసం చట్టాలను కఠినతరం చేసి సత్వర న్యాయం జరగాలని సంఘం అధ్యక్షురాలు ప్రతిభ లక్ష్మీ కోరారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఆదర్శ్‌నగర్‌లో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలపై జరుగుతున్న దాడులను తెలియజేస్తూ విద్యార్థినులు నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం వివిధ రంగాల్లో రాణిస్తున్నవారికి మహిళా శిరోమణి పురస్కారంతో గౌరవించారు.

ఫ్యాషన్‌ షో

మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ గచ్చిబౌలిలో హైబిజ్‌ టీవీ ఉమెన్స్‌ లీడర్‌ షిప్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవం జరిగింది. పంచాయితీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌, శాంత బయోటెక్‌ ఛైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొని... ఆయా రంగాలకు సంబంధించి 17 విభాగాల్లో రాణిస్తున్న మహిళలకు ఉమెన్స్‌ లీడర్‌ షిప్‌ అవార్డుతో సత్కరించారు. అనంతరం కరోనా సమయంలో సేవలందించిన మహిళలకు చేయూతనిచ్చేందుకు ఫ్యాషన్‌ షో నిర్వహించారు. విభిన్న వస్త్రాలను ధరించి మోడల్స్‌ ర్యాంప్‌పై తమ హంసనడకలతో ఆకట్టుకున్నారు.

ఇదీ చూడండి : ఘనంగా ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.