హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో వెన్నెముక చికిత్సలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. కార్యక్రమాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సదస్సులో వెన్నెముక సమస్యలు, ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న శస్త్ర చికిత్సలపై చర్చించనున్నారు. అత్యాధునిక శస్త్ర చికిత్స అందుబాటులోకి తీసుకురావడం నడుము నొప్పితో బాధపడుతున్న వారికి వరంలాంటిదని చినజీయర్ అన్నారు. ప్రజలకు తక్కువ ధరకే వైద్య సేవలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రస్తుతం 50 నుండి 84 శాతం వరకు ప్రజలు వెన్ను సమస్యతో బాధపడుతున్నారని ఆసుపత్రి ఎండీ జీఎస్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికా, జర్మనీ, ఇండోనేషియా, తైవాన్‌తో సహా 20 దేశాలకు చెందిన ప్రముఖ వైద్యులతోపాటు, 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: చెన్నై దాహం తీర్చేందుకు ప్రత్యేక రైలు