ETV Bharat / state

నేటి నుంచి ఇంటర్​ పరీక్షలు.. హాజరవనున్న 9 లక్షలకుపైగా విద్యార్థులు

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా.. పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులంతా హాల్​టికెట్​లో పొందుపర్చిన నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.

ఇంటర్​ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి... నిబంధనలు గుర్తున్నాయిగా..?

author img

By

Published : Mar 3, 2020, 11:12 PM IST

Updated : Mar 4, 2020, 4:39 AM IST

బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్న ఇంటర్మీడియట్​ పరీక్షలకు సర్వం సిద్ధమైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇవాళ మొదటి సంవత్సరం ద్వితీయ భాష పరీక్ష జరగనుంది. మొదటి సంవత్సరం 4 లక్షల 80 వేల 516 మంది.. రెండో సంవత్సరం 4 లక్షల 85 వేల 323 మంది కలిపి మొత్తం 9 లక్షల 65 వేల 839 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1339 పరీక్ష కేంద్రాలు, ఒక్కో కేంద్రానికి ఒకరు చొప్పున చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, 25వేల 550 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో కనీసం నాలుగు సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. మార్చి 18 వరకు ప్రధాన పరీక్షలు కొనసాగుతాయి.

ఇవీ నిబంధనలు..

ఉదయం 8 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులకు అనుమతిస్తారు. ఉదయం 8 గంటల 45 నిమిషాలకు విద్యార్థులు ఓఎంఆర్​ సమాధాన పత్రాలు.. 9 గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. పరీక్ష కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవడానికి లొకేటర్ మొబైల్ యాప్‌ను ఇంటర్ బోర్డు రూపొందించింది. విద్యార్థులు నేరుగా వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.

సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్​ రూం

ఫిర్యాదుల పరిష్కారానికి ప్రతి జిల్లా ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్​సైట్​లోని బిగ్​ఆర్​ఎస్ ద్వారా ఆన్ లైన్​లో కూడా ఫిర్యాదులు చేయవచ్చు. కంట్రోల్ రూంను ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు.. 040 24600110 ద్వారా సంప్రదించవచ్చని విద్యాశాఖ అధికారులు వివరించారు.

ఒత్తిడెందుకు దండగా.. ఈ నంబర్​ ఉందిగా..

గతేడాది తలెత్తిన సమస్యలన్నీ పరిష్కరించామని.. విద్యార్థులు నిశ్చింతగా పరీక్షలు రాయాలని అధికారులు పేర్కొన్నారు. ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరారు. ఒత్తిడికి లోనైతే 7337225803కి ఫోన్ చేయవచ్చునని.. సీనియర్ క్లినికల్ సైకలాజిస్టులు తగిన సూచనలు ఇస్తారని తెలిపారు.

ఇదీ చూడండి: కరోనా ఎలా సోకుతుంది... దానిని ఎలా కట్టడి చేయాలి?

Last Updated : Mar 4, 2020, 4:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.