Police search in Congress war room: కాంగ్రెస్‌వార్ రూంలో విధులు నిర్వహిస్తున్న వ్యక్తులపై దర్యాప్తును నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఎఫ్ఐఆర్తో పాటు 41 సీఆర్పీసీ కింద జారీ చేసిన నోటీసులను కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే వార్‌రూంలో సోదాలు నిర్వహించి.. అక్కడున్న వస్తువులు స్వాధీనం చేసుకున్నారన్నరని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వార్‌రూంలో పనిచేస్తున్న వ్యక్తులను ఎటువంటి కారణాలు లేకుండా రెండురోజులు అక్రమంగా నిర్భందించారని పేర్కొన్నారు.
దానికిగాను బాధితులకు 20 లక్షల పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు. ఈ సందర్భంలో పోలీసుల తరుపున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధ్యలో కల్పించుకొని పిటిషనర్లను అరెస్టు చేయలేదని విచారించి వదిలివేసినట్లు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసును రేపటికి వాయిదా వేసింది. మరో వైపు ఈ కేసుకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని హిమచల్ప్రదేశ్కు చెందిన ఇషాన్ శర్మ, విశాఖపట్నంకు చెందిన శశాంక్ తాతినేని, విజయవాడ వాసి శ్రీపతాప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: