ETV Bharat / state

విద్యార్థి అదృశ్యం... పరీక్షలే కారణమా?

చిలకలగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ ఇంటర్​ విద్యార్థి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరీక్షల భయంతోనే ఇంట్లో నుంచి పారిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Mar 6, 2020, 3:34 PM IST

inter student missing at jkarkhana in heyderabad
ఇంటర్​ విద్యార్థి అదృశ్యం.. పరీక్షల భయమే కారణమా..?

సికింద్రాబాద్​లోని కార్ఖానాలో ఉదయ్​కుమార్ అనే ఓ ఇంటర్​ విద్యార్థి అదృశ్యమయ్యాడు. మారేడుపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఉదయ్​కుమార్​.. ఈనెల 4వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు చిలకలగూడ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇంటర్​ పరీక్షల నేపథ్యంలో ఉదయ్​కుమార్​ సీతాఫల్​మండిలోని తన బాబాయ్​ కొడుకు ఆనంద్​తో కలిసి చదువుకుంటున్నాడు. ఈనెల 1న తన ఇంటికి వెళ్లి దుస్తులు, ఆధార్​కార్డు, పలు ధ్రువపత్రాలు తీసుకుని సీతాఫల్​మండికి వచ్చాడు. 4వ తేదీన హాల్​ టికెట్​ కోసం వెళ్తున్నట్లు ఇంట్లో వాళ్లకు చెప్పి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఉదయ్​కుమార్​ కనిపించక పోవడం వల్ల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంటర్​ మొదటి సంవత్సరంలోనూ ఉదయ్​కుమార్ 5 సబ్జెక్టుల్లో ఫెయిల్​ అయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. పరీక్షల భయంతోనే ఇంటిని వీడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రికి కరోనా సోకిన ఇటలీ పర్యటకులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.