ETV Bharat / state

TS Inter board: ఇంటర్‌బోర్డు లెక్కలేనితనం... రికార్డులకు ఎక్కని 70 వేల మంది విద్యార్థులు

రాష్ట్రంలో ఇంటర్‌ వార్షిక పరీక్షలు మరో నాలుగు నెలల్లో జరుగుతాయి. అయినప్పటికీ ఈ విద్యా సంవత్సరం ఎంత మంది విద్యార్థులు చేరారనే దానిపై సరైన స్పష్టత లేదు. ఏ విద్యార్థి ఏ కళాశాలలో చేరారో ఇంటర్‌బోర్డుకు(intermediate board) తెలియని పరిస్థితి. ప్రైవేట్‌ కళాశాలలకు అనుమతుల జారీ పూర్తి చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.

Intermediate board
Intermediate board
author img

By

Published : Nov 17, 2021, 7:16 AM IST

రాష్ట్రంలో (telangana intermediate board)ఇంటర్‌ వార్షిక పరీక్షలు మరో నాలుగు నెలల్లో జరుగుతాయి. ప్రవేశాల గడువూ ఈ నెల 12తో ముగిసింది. అయినా ఈ విద్యా సంవత్సరం ఎంత మంది చేరారు? ఏ విద్యార్థి ఏ కళాశాలలో చేరారో ఇంటర్‌బోర్డుకు(intermediate board) తెలియని పరిస్థితి. ప్రైవేట్‌ కళాశాలలకు అనుమతుల జారీ పూర్తి చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.

ఈ ఏడాది 1570 ప్రైవేట్‌ కళాశాలలు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్‌)నకు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు 1269 కళాశాలలకు అనుమతి దక్కింది. మిగిలిన 301 కళాశాలలకు అనుమతిపై ఇంటర్‌బోర్డు(intermediate board) తాత్సారం చేస్తోంది. ఈ కళాశాలల్లో దాదాపు 70 వేల మంది ప్రవేశాలు పొందారు. ఇవన్నీ వాణిజ్య, గృహ సముదాయాల్లో (మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ) నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారం వాటికి అగ్నిమాపకశాఖ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం(ఎన్‌ఓసీ) అవసరం. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ విద్యా సంవత్సరానికి ఎన్‌ఓసీ నుంచి అగ్నిమాపకశాఖ మినహాయింపు ఇచ్చింది. దానిపై గత నెల 5న జీఓ 95 జారీ చేసింది. ఈ ఉత్తర్వు ఇచ్చి 40 రోజులు దాటినా ఇంకా ఈ కళాశాలలు అనుబంధ గుర్తింపునకు నోచుకోలేదు.

ఆ విద్యార్థులు చేరనట్టే..

అఫిలియేషన్‌ ఉన్న కళాశాలలకు ఇంటర్‌బోర్డు ఆన్‌లైన్‌లో ప్రవేశాల లాగిన్‌ ఇస్తుంది. ప్రవేశాలు పొందిన విద్యార్థుల పేర్లను అందులో నమోదు చేసి బోర్డుకు(telangana intermediate board) పంపిస్తారు. వీరు మాత్రమే పరీక్ష రుసుములు చెల్లించేందుకు అర్హులు. గుర్తింపు లేని కళాశాలల్లో చేరిన విద్యార్థులు ప్రభుత్వ దృష్టిలో చేరనట్టే. చివరికి వీరి పరిస్థితి గందరగోళంగా తయారవుతుంది. ఈ 301 కళాశాలలకు అనుమతులు జిల్లా ఇంటర్‌ విద్యాశాఖల్లో, బోర్డులోని వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రథమ సంవత్సరం పరీక్షలు, మూల్యాంకనం కారణంగా అనుమతుల్లో జాప్యమైందని బోర్డు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ఈ గుర్తింపుతో పాటు ఏ ప్రక్రియను కూడా బోర్డు సకాలంలో పూర్తి చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

ఇదీ చదవండి: Kaloji University: కాళోజీ హెల్త్​ యూనివర్సిటీలో నేడు మాప్ అప్ వెబ్‌ కౌన్సెలింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.