యాత్ర కొనసాగించండిలా
- పంబ వరకు వాహనాలను అనుమతించరు. తప్పనిసరిగా నీల్‌కల్‌లోనే నిలపాలి. అక్కడి నుంచి దేవస్థానం, కేరళ ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రతి 10 నిమిషాలకొకటి చొప్పున నడిపే బస్సులు వినియోగించుకోవచ్చు.
- సన్నిధానంకు ఏటవాలుగా ఉన్న కొండ ఎక్కే క్రమంలో ప్రతి పది నిమిషాలకు ఒకసారి తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. అనారోగ్య సమస్యలున్న వారు ఆగుతూ వెళ్లడం శ్రేయస్కరం.
- కొండ ఎక్కే సమయంలో కొందరికి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతుంటారు. దారిలో అక్కడక్కడా ఉన్న ఆక్సిజన్ పార్లర్లు, కార్డియాక్ సెంటర్లను సంప్రదించవచ్చు
- రద్దీ రోజుల్లో సన్నిధానంలో బస చేయకపోవడమే ఉత్తమం. స్వామి దర్శనం అనంతరం తక్షణం తిరిగి పంబకు చేరుకోవడం మంచిది.
- పెద్ద పాదం యాత్ర పగటి పూటే యాత్ర చేయాలి. కేరళ ప్రభుత్వం రాత్రుళ్లు పెద్దపాదం యాత్రను నిషేధించిన విషయం గుర్తించాలి.
- పెద్దపాదం యాత్రలో ఎరిమేలి, అలుదానది, కాళకట్టి, కరిమల, పెరియారమట్టం, పంబ ప్రాంతాల్లో అయ్యప్ప సేవా సంఘం ఏర్పాటు చేసిన విచారణ కేంద్రాలు, వైద్య శిబిరాలు, అన్నదాన కేంద్రాలను వినియోగించుకోవచ్చు.
- శబరిమలతోపాటు కేరళలో పాలిథిన్ బ్యాగుల వాడకం నిషేధం. ప్లాస్టిక్ సంచులను వెంట తీసుకుపోద్దు.
- ఇరుముడితోపాటు నగదు, వస్తువులు, బ్యాగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్వాముల వేషంలో దొంగలు పొంచి ఉంటారు. ముఖ్యంగా పంబ నదిలో స్నానం చేసే సమయంలో జాగ్రత్తలు అవసరం.
జనవరి 14న మకర జ్యోతి దర్శనం
2023 జనవరి 14న శబరిలో మకర జ్యోతి దర్శనం ఉంటుందని అరుణ్ గురుస్వామి తెలిపారు. ప్రస్తుతం డిసెంబరు 26 వరకు శబరిమలలో అయ్యప్ప సన్నిధానం తెరిచి ఉంటుంది. 27న ఆలయాన్ని మూసివేస్తారు. డిసెంబరు 30 నుంచి జనవరి 19 వరకు ఆలయం తెరిచే ఉంటుంది.
- ఎరిమేలి-పంబ 80 కి.మీ
- కొట్టాయం-ఎరిమేలి 55 కి.మీ
- కొట్టాయం-పంబ 123 కి.మీ
- చెంగనూర్-పంబ 93 కి.మీ
- చెంగనూర్-ఎరిమేలి 45 కి.మీ
- పంబ-సన్నిధానం 7 కి.మీ.
ఇవీ చూడండి: