కొవిడ్ కారణంగా మూతపడ్డ అర్బన్ ఫారెస్ట్ పార్కులు నేటి నుంచి తిరిగి అందుబాటులోకి రానున్నట్లు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పార్కులు తెరుస్తున్నట్లు ఆయన చెప్పారు.
కొవిడ్ నిబంధనలను అనుసరించి సందర్శకులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని, మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జంతు ప్రదర్శనశాల దినోత్సమైన అక్టోబర్ 6 నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోకి సందర్శకులను అనుమతించనున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. వర్షం నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో నీటిని తొలగించి పార్కును పూర్తిగా శుభ్రపరచాలని జూ అధికారులను ఆదేశించారు.
- ఇదీ చూడండి: బాలు లాంటి సింగర్ మళ్లీ పుట్టడం కష్టం!