సికింద్రాబాద్ సీతాఫల్మండి ప్రాంతానికి చెందిన అదురీ చేతన్ శర్మ ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ చదువుతున్నాడు. కరోనా వైరస్ భయంతో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం భారత దేశానికి చెందిన మెడిసిన్ విద్యార్థులను స్వదేశానికి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. నిన్న రాత్రి ఒంటిగంటకు దాదాపు 150 మంది మెడిసిన్ విద్యార్థులు ఫిలిప్పీన్స్ నుంచి కౌలాలంపూర్ మీదుగా ఇండియా బయల్దేరారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు కౌలాలంపూర్ విమానాయశ్రయంలో దిగారు.
సాయంత్రం 6 గంటలకు ఎయిరిండియా విమానంలో వీరు ఇండియాకు రావాలి. కానీ భారత ప్రభుత్వం 3 గంటలకు మలేషియా విమానాల రాకపోకలను రద్దు చేసింది. 150 మంది వైద్య విద్యార్థులు ఉదయం నుంచి ఇప్పటివరకు ఇండియాకు ఎలా రావాలో దిక్కుతోచని స్థితిలో కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. మమల్ని తీసుకెళ్లండి అంటూ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదే విషయమై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇదీ చూడండి: ఆర్బీఐ అభయంతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు