ETV Bharat / state

వినియోగదారులకు ఐఓసీఎల్ నూతన ఆఫర్లు... - Indian Oil Inaugurations

వాహనదారులను ఆకర్షించేందుకు వినూత్నమైన ప్రయోగాలకు నాంది పలికింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సికింద్రాబాద్ బేగంపేట్​లోని కోకో బేగంపేట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దీనికి వేదికైంది.

ఇండియన్ ఆయిల్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్లు

author img

By

Published : Mar 11, 2020, 7:15 AM IST

దేశ వ్యాప్తంగా అత్యధిక వినియోగదారులను కలిగి ఉన్న ఐఓసీఎల్ తన వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి పలు రకాల సేవలను, అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగా సెర్వో ఎక్స్​ప్రెస్ సర్వీస్ ఫోర్స్ పేరిట ద్విచక్ర వాహనాలకు ఉచిత ఆయిల్ చేంజ్​తో పాటు మైనర్ రిపేరింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

నూతనంగా రాబోతున్న బీఎస్ 6 వాహనాల కోసం క్లియర్ బ్లూ ఇంజిన్ ఆయిల్ తీసుకొచ్చమని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ఆయిల్ వాడటం వల్ల మైలేజీ పెరుగుతుందన్నారు. వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.

సిప్లాతో ఒప్పందం

ప్రఖ్యాత సిప్లా కంపెనీ సహాకారంతో ఇండియన్ ఆయిల్ వినియోగదారులకు మరొక సువర్ణావకాశం కల్పిస్తున్నామని తెలంగాణ హెడ్ శ్రవణ్ ఎస్ రావు అన్నారు. రూ. 600 పెట్రోల్ పోసుకున్న వారికి రూ. 89 విలువ గల సిప్లా చాక్లెట్ ప్యాకెట్, రూ. 1, 600 విలువ కలిగిన పెట్రోల్ పోయించుకున్న వారికి రూ. 299 విలువ గల చాక్లెట్ బాక్స్ ను ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించారు.

అత్యధిక ఆయిల్ వినియోగదారులకు 10 శాతం నగదు రివార్డును ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. కంపెనీ ప్రతినిధులు గాల్లోకి బెలూన్​లను వదిలారు. కార్యక్రమంలో ప్రతినిధులు మనీష్ తివారి, సురేష్ బాబు, శరత్ కుమార్, ఆంజనేయ వర ప్రసాద్, ఇండియన్ ఆయిల్ వివిధ ప్రాంతాల డీలర్లు పాల్గొన్నారు.

ఇండియన్ ఆయిల్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్లు

ఇవీ చూడండి : అంబానీని వెనక్కి నెట్టి.. అగ్ర స్థానానికి జాక్​మా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.