ETV Bharat / state

అమెరికాకు వెళ్లడం ఇక మనోళ్లకు ఇబ్బందికరమే

author img

By

Published : Apr 22, 2020, 7:56 AM IST

అగ్రరాజ్యాధినేత ట్రంప్‌ చేసిన ట్వీట్‌తో భారతీయుల్లో కలవరం మొదలైంది. అమెరికాలో మనవాళ్లకు ఉద్యోగావకాశాలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Indian immigrants are deeply embarrassed by US President Trump's tweet
అమెరికాకు వెళ్లడం ఇక మనోళ్లకు ఇబ్బందికరమే

ట్రంప్‌ ప్రకటన చట్టమైతే... భారతీయులకు అమెరికాలో ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్యాటకులు మినహా అన్ని రకాల ఇతర వీసాదారులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని అమెరికా వ్యవహారాల అధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. ఇది తెలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులకూ ఇబ్బందికరమేనని అమెరికా వీసా వ్యవహారాల నిపుణుడు ఉడుముల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఇక్కడి నుంచి అమెరికావెళ్లే వారిలో ఎఫ్‌-1 (విద్యార్థులు), హెచ్‌1బి (ఉద్యోగార్థులు) అధికం. ఎఫ్‌-1 వీసాపై అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థుల్లో చాలా మంది చేసే ఉద్యోగాలు చట్ట వ్యతిరేకమైనా, ప్రభుత్వం అంతగా పట్టించుకునేది కాదు. వీటిపై ఇప్పుడు నిఘా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

హెచ్‌1బీ వారిపై సానుకూలత చూపండి

అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల హెచ్‌1బీ వీసాల గడువు పొడిగింపు విషయంలో సానుకూలత చూపాలని అమెరికాను భారత ప్రభుత్వం కోరింది. వారు వీసా గడువు తీరిన తరువాత మాతృదేశానికి వచ్చి స్టాంపింగ్‌ వేయించుకోవాలి. లాక్‌డౌన్‌ కారణంగా ఈ గడువును సుమారు 8 నెలల పాటు పొడిగించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం అంగీకరించింది. మరోవైపు లాక్‌డౌన్‌కు ముందే స్టాంపింగ్‌ కోసం ఇక్కడికి వచ్చి చిక్కుకుపోయిన వారి ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల వారు కూడా వందల సంఖ్యలో ఉన్నట్లు అంచనా. ఇలాంటి వారి విషయంలోనూ సానుకూలంగా స్పందించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఇదీ చదవండి: జాతీయ రహదారులపై అభివృద్ధి పనులు ప్రారంభం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.