ETV Bharat / state

జూన్‌ 23 నుంచి దివ్యాంగుల క్రికెట్‌ సిరీస్‌ - దివ్యాంగుల క్రికెట్ సిరీస్ 2021

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ దివ్యాంగుల క్రికెట్ సిరీస్​ను నిర్వహిస్తున్నట్లు.. బోర్డ్‌ ఆఫ్‌ డిసేబుల్డ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఇండియా ప్రకటించింది. జూన్ 22 తేదీ నుంచి 25 రోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మ్యాచ్​లను నిర్వహిస్తున్నట్లు ముఖ్య కార్యదర్శి కె.రామిరెడ్డి తెలిపారు.

Paralympic Cricket 2021
Paralympic Cricket 2021
author img

By

Published : May 2, 2021, 1:19 PM IST

బోర్డ్‌ ఆఫ్‌ డిసేబుల్డ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఇండియా(బీడీసీఏ) ఆధ్వర్యంలో ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ 'దివ్యాంగుల క్రికెట్‌ సిరీస్‌-2021’ను జూన్‌ 23 నుంచి నిర్వహించనున్నట్లు బీడీసీఏ ముఖ్య కార్యదర్శి కె.రామిరెడ్డి ప్రకటించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దాదాపు 25 రోజుల పాటు మ్యాచ్‌లు ఉంటాయని పేర్కొన్నారు. హైదర్‌గూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. చల్లా గ్రూప్‌ సీఈఓ ఈశ్వరన్​తో కలిసి.. క్రికెట్‌ సిరీస్‌కు సంబంధించిన గోడ ప్రతులు, బ్రోచర్లను ఆవిష్కరించారు.

ఒకటో వన్డేలో భాగంగా.. హైదరాబాద్‌ వేదికగా జూన్‌ 23 నుంచి నాలుగు రోజుల పాటు టెస్ట్‌ మ్యాచ్​లు ఉంటాయాన్నారు రామిరెడ్డి. 2వ వన్డే విశాఖపట్నం, 3వ వన్డే బెంగళూరు, 3 టీట్వంటీ సిరీస్‌లను జైపూర్‌లో నిర్వహించనున్నట్లు వివరించారు. తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈశ్వరన్‌ మాట్లాడుతూ.. తమ గ్రూప్‌ తరఫున ఈ క్రికెట్‌ సిరీస్‌ను సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో.. సంస్థ ప్రతినిధులు మహమూద్​ అలీ ఖురేషీ, నయీముద్దీన్‌, ఖేలో ఇండియా క్రీడాకారులు, ఇండియన్‌ టీమ్‌ కెప్టెన్‌ వై.వసంత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఐపీఎల్​: సురేశ్​ రైనా ఖాతాలో మరో ఘనత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.