హైదరాబాద్ కొండాపూర్లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయుధ పోరాట వీరుల్లో ఒకరైన చెన్నమనేని రాజేశ్వరరావు సోదరుడు చెన్నమనేని వెంకటేశ్వరరావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కమ్యూనిస్ట్ యోధుడు చండ్ర రాజేశ్వరరావు వృద్ధాశ్రమంలో ఉంటున్నవారికి ఏదో రూపంలో స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం ఉండడం విశేషం. అలనాటి పోరాట స్మృతులను వారు ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు.
ఇదీ చూడండి: స్వాతంత్ర్య వేడుకల వేళ... కశ్మీర్లో భద్రత కట్టుదిట్టం