ETV Bharat / state

Independence Day Awards Telangana 2023 : ఉత్తమ సేవకు ఉన్నత అవార్డులు.. జెండా పండుగ వేళ కేసీఆర్‌ చేతుల మీదుగా అవార్డులు - ఖమ్మం వరదలు

Independence Day Awards Telangana 2023 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు విభాగాలకు చెందిన ఉద్యోగులకు అవార్డులను అందించింది. గోల్కొండ కోట వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్.. వారికి అవార్డులు ప్రధానం చేశారు. ఇటీవలి కాలంలో భారీ వర్షాలు, వరదల సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి.. పలువురిని కాపాడడంతో పాటు విశేష సేవలు చేసిన అధికారులకు అవార్డులు లభించాయి.

Independence Day Celebrations in Telangana
Independence Day Awards Telangana 2023
author img

By

Published : Aug 15, 2023, 5:43 PM IST

Independence Day Awards Telangana 2023 ఉత్తమ సేవకు ఉన్నత అవార్డులు.. జెండ పండుగ వేళ కేసీఆర్‌ చేతుల మీదుగా అవార్డులు తీసుకొంది వీరే..

Independence Day Awards Telangana 2023 : తెలంగాణ వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోట వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ (CM KCR) పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ సాంధించిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో సంభవించిన భారీ వరదలు(Floods), వర్షాల్లో ధైర్య సాహాసాలు ప్రదర్శించిన 14మంది అధికారులకు ప్రభుత్వం అవార్డులను అందించింది. సీఎం కేసీఆర్‌ వీరికి అవార్డులను ప్రధానం చేశారు.

అవార్డు గ్రహీతలు.. వారు చేసిన సేవలు:

  • ములుగు జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు పాయం వీనయ్య ఏటూరునాగారం మండలం కొండాయ్ గ్రామంలో వరదల్లో చిక్కుకున్న పాఠశాల విద్యార్థులను రక్షించారు.
  • జనగాం జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ లైన్ మెన్ ఎండీ రెహమాన్ విద్యుత్ పునరుద్ధరణలో విశేష సేవలు అందించారు.
  • ములుగు జిల్లాకు చెందిన పంచాయతీకార్యదర్శి సంజీవ్ రావు ముత్యాల ధార జలపాతంలో చిక్కుకున్న 80 మంది యాత్రికులను రక్షించడంలో గొప్ప సమన్వయం కనబరిచారు.
  • ములుగు జిల్లా పరిషత్ సీఈఓ ప్రసన్న రాణి కొండాయ్ గ్రామంలో వరదల్లో చిక్కుకున్న గర్భిణులను క్షేమంగా తరలించడంతో పాటు, వాయుమార్గం ద్వారా చేపట్టిన ఆహార పంపిణీని జాగ్రత్తగా పర్యవేక్షించారు.
  • భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి ఆర్ఏఎస్పీ లత వరదల్లో చిక్కుకున్న జిల్లాలోని పలు గ్రామాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టారు.
  • భూపాలపల్లి జిల్లాకు చెందిన రెవెన్యూ ఇన్ స్పెక్టర్ బి.ప్రదీప్ కుమార్ వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షిచేందుకు బోట్లు, హెలికాప్టర్ సేవలను సమర్థంగా వినియోగించి వంద మందికి పైగా ప్రజలను రక్షించి, పునరావాస కేంద్రాలకు (Rehabilitation centers) తరలించారు.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వి. వెంకటేశ్వర్లు వరదల్లో చిక్కుకున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలను రక్షించడంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి రక్షణ, పునరావాస చర్యలు చేపట్టారు.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండల పంచాయతీ అధికారి ముత్యాల రావు వరదల్లో చిక్కుకున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలను రక్షించడంలో గొప్ప ధైర్యసాహసాలు ప్రదర్శించారు.
  • భూపాలపల్లి జిల్లాకు చెందిన పోలీస్ ఇన్​స్పెక్టర్ రామనరసింహారెడ్డి వరదల్లో చిక్కుకున్న ప్రజలను తరలించడంతో పాటు తప్పిపోయిన నలుగురు వ్యక్తులను రక్షించారు.
  • మరో మూడు మృతదేహాలను గుర్తించారు. భూపాలపల్లి జిల్లా కొయ్యురు ఎస్సై వి.నరేష్ మానేరు నది వరదల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రక్షించారు.
  • వరంగల్ జిల్లా మట్వాడ ఏఎస్ఐ కె.సంపత్ తన బృందంతో వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న 880 మంది ప్రజలను రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
  • ములుగు జిల్లాకు చెందిన ఏఎస్సై జి.రాంబాబు మేడారంలో వరదల్లో చిక్కుకున్న 19 మందిని తన బృందంతో రక్షించారు.
  • ములుగు జిల్లాకు చెందిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్ట్ కాన్ స్టేబుల్ కె. శ్రీకాంత్ మేడారం వరదల్లో (Medaram Floods) చిక్కుకున్న 19 మందిని తన బృందంతో కలిసి రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
  • సచివాలయ ఎన్ఆర్ఐ విభాగం ఏఎస్ఓ ఏడిగ చిట్టిబాబు.. ఉక్రెయిన్, సూడాన్ దేశాల్లో యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను స్వరాష్ట్రానికి తరలించడంలో చురుకైన పాత్ర పోషించారు.

CM KCR Speech at Golconda Fort : 'తెలంగాణ ప్రగతి చూసి యావత్‌ దేశం ఆశ్చర్యపడుతోంది'

77th Independence Day Celebrations in Hyderabad : హైదరాబాద్​లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

'వచ్చే ఏడాది ఎర్రకోటపై మరోసారి ప్రసంగిస్తా'.. 2024 ఎన్నికల గెలుపుపై ప్రధాని మోదీ ధీమా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.