ETV Bharat / state

Innohub Tech Cheating: బయటకొస్తున్న ఇన్నోహబ్​ బ్యాక్​డోర్ బాధితులు

author img

By

Published : May 31, 2022, 8:01 PM IST

Innohub Tech Cheating: ఉద్యోగాల పేరిట లక్షల రూపాయలు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టిన ఇన్నోహబ్​ సాఫ్ట్​వేర్ కంపెనీ బాధితులు ఒక్కొక్కరిగా బయటకువస్తున్నారు. ఇవాళ మరో 20 మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Innohub Tech
Innohub Tech

Innohub Tech Cheating: మాదాపూర్ పీఎస్ పరిధిలో బ్యాక్​డోర్ ఉద్యోగాల పేరుతో మోసపోయిన కేసులో బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఇన్నోహబ్ టెక్నాలజీ ప్రై.లిపై మరో 20మంది బాధితుల ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 80 మందికి పైగా బాధితులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఫిర్యాదులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్‌ఐఆర్​లో సంస్థకు చెందిన రాహుల్ అకోలేతో పాటు మరో మహిళ కమలేశ్​ కుమారిని నిందితులుగా చేర్చారు.

ఈ నేపథ్యంలో బాధితులు సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్​లో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన 2వేల మందిని ఇన్నోహబ్ సంస్థ రిక్రూట్ చేసుకుందని బాధితులు చెబుతున్నారు. బాధితుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారన్నారు. అయితే ఇప్పటి వరకూ సంస్థ ప్రతినిధులు పోలీసులకు అందుబాటులోకి రాలేదు. బ్యాక్​డోర్​లో ఉద్యోగం ఇస్తామని ఒక్కొక్కరి నుంచి రూ. 1.5 నుంచి 2లక్షల వరకు వసూలు చేసిన సంస్థ... రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి బోర్డు తిప్పేసింది. దీంతో ఉద్యోగులు రోడ్డున పడ్డారు.

మేమే కాదు మా లాగా 2వేల మంది మోసపోయారు. ప్రతి ఒక్కరం రూ. 2 లక్షలు కట్టాం. ఈ స్కామ్​లో దాదాపు 15 మంది దాకా ప్రమేయం ఉంది. ఒక సంవత్సరం నుంచే వీరు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇదంతా చేశారు. కంపెనీ మెయిల్స్, వ్యక్తిగత మెయిల్స్ బ్లాక్ చేశారు. మాకు అనుమానం వచ్చి కంపెనీ వద్దకు వచ్చి చూస్తే అసలు ఇక్కడ కంపెనీనే లేదు. కన్సల్టెంట్ మెంబర్ ద్వారా దాదాపు 500 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఉద్యోగంలో చేరినా కూడా ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు. -- బాధితులు

ఇదీ చూడండి:

Software Comapany Cheating: బ్యాక్​డోర్​ ఉద్యోగాల పేరిట సాఫ్ట్​వేర్ కంపెనీ టోకరా

'నీ పొట్ట ఏంటి నాయనా.. బస్తాలా ఉంది! ఏం తింటున్నావ్​?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.