ETV Bharat / state

క్షీణిస్తున్న గాలి నాణ్యత.. అన్‌లాక్‌తో పెరుగుతున్న కాలుష్యం - హైదారాబాద్ కాలుష్యం తాజా వార్తలు

రోజురోజుకు గాలిలో నాణ్యత లోపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో అన్‌లాక్‌తో కాలుష్యం మరింత పెరుగుతోంది. దక్షిణాదిలో హైదరాబాద్‌లోనే అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Increasing air pollution with unlock in telangana
క్షీణిస్తున్న గాలి నాణ్యత.. అన్‌లాక్‌తో పెరుగుతున్న కాలుష్యం
author img

By

Published : Oct 9, 2020, 8:11 AM IST

లాక్‌డౌన్‌ సమయంలో స్వచ్ఛమైన గాలితో ‘ఊపిరి’ పీల్చుకున్న నగర, పట్టణవాసులు క్రమంగా ఆ పరిస్థితికి దూరమవుతున్నారు. గాలి నాణ్యత సూచీ రోజురోజుకు పడిపోతోంది. రాజధాని హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లో సెప్టెంబరు వరకు గాలి నాణ్యత.. సూచీలో 0-50 పాయింట్ల మధ్య ‘గ్రీన్‌’ విభాగంలో మంచి స్థితిలో ఉంది. అక్టోబరులో రోజుకు 100కి పైగా పాయింట్ల నమోదుతో ‘పసుపుపచ్చ ’ విభాగానికి పడిపోయింది. అంటే గాలి నాణ్యత సూచీ ‘ఓ మోస్తరు’ స్థితికి చేరింది. అన్‌లాక్‌ వెసులుబాట్లతో.. జనజీవనం సాధారణ స్థితికి చేరుతోంది. పరిశ్రమల్లో జరుగుతున్న ఉత్పత్తి.. రహదారులపై పెరుగుతున్న ట్రాఫిక్‌తో పొగ, దుమ్మూధూళి అధికం అవుతున్నాయి. దీంతో వాయుకాలుష్యం పెరిగి స్వచ్ఛమైన గాలి తగ్గుతోంది.

దేశంలో 113 నగరాల్లో వాయునాణ్యత సూచీని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రతిరోజూ పరిశీలిస్తుంది. పలు ఉత్తరాది నగరాల్లో గాలి నాణ్యత ఇప్పటికే బాగా పడిపోయింది. దక్షిణాదిలో హైదరాబాద్‌తో పాటు కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లోనే గాలి నాణ్యత సూచీ 100 పాయింట్లు దాటుతోంది. హైదరాబాద్‌ శివారు సంగారెడ్డి జిల్లా ఇక్రిశాట్‌, పాశమైలారంలోనూ ఇదే పరిస్థితి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.