ETV Bharat / state

మూడు రోజుల్లో 928 డ్రంక్​ అండ్​ డ్రైవ్ కేసులు : సీపీ

author img

By

Published : Dec 30, 2020, 1:33 PM IST

సైబరాబాద్ పరిధిలో మూడురోజుల్లోనే 928 డ్రంక్​ అండ్​ డ్రైవ్ కేసులు నమోదైనట్లు సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు 3వేల 387 డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

cp sajjanar
ల్లో 928 డ్రంక్​ అండ్​ డ్రైవ్ కేసులు: సీపీ

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని కట్టడి చేసేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వివిధ ప్రాంతాల్లో డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

పట్టుబడిన వారి వాహనాలు సీజ్​ చేసి.. వాహనదారులపై కేసు నమోదు చేసి.. కోర్టులో హాజరుపరుస్తున్నారు. గత మూడు రోజులుగా కమిషనరేట్ పరిధిలో చేపట్టిన డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీల్లో 928 కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 3వేల 387 డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులు నమోదయ్యాయి.

21 నుంచి 40 ఏళ్లలోపు వారే ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది సైబరాబాద్‌లో ఇప్పటి వరకు మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యవహారంలో 155 రోడ్డు ప్రమాదాలు జరగ్గా... 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 31న కూడా పెద్ద ఎత్తున డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టనున్నట్టు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. ప్రజలందరూ పోలీసులు సూచించిన నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి: డ్రైవింగ్ లైసెన్స్​ల గడువు మరోసారి పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.