పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇంధన పొదుపు ఎంతో అవసరమని ఎవరెస్ట్ పర్వతారోహకుడు వరల్డ్ రికార్డు గ్రహీత ఆమ్ గోతు తుకారాం పేర్కొన్నారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించిన 5కె సైక్లోథాన్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఓయూ ప్రధాన రహదారి వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హెచ్పీసీఎల్ ప్రతినిధులు, అధికారులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రాథోడ్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రైతు గుండె చప్పుడు- రాకేశ్ టికాయిత్!